కరడుగట్టిన బ్రాహ్మణ డాన్ విడుదల

యోగి నాయకత్వాన్ని మౌర్య ఎత్తి చూపిస్తున్నాడు. ఒక్కోసారి ధిక్కరిస్తున్నాడు.

తరచూ ఆంధ్ర రాజకీయాలు, అమెరికాలో తెలుగువారి సంగతులు చెప్పుకునే మనం కాస్త భిన్నంగా ఉత్తరప్రదేశులో జరుగుతున్న రాజకీయాన్ని గురించి చెప్పుకుందాం.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని మనకు తెలుసు. నిజంగానే యోగి మాదిరిగా కాషాయం ధరించి కనిపిస్తాడాయన. ఆయన కేబినేట్లో ఉన్న ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. వాళ్లిద్దరికీ కొంతకాలంగా పడట్లేదు. యోగి నాయకత్వాన్ని మౌర్య ఎత్తి చూపిస్తున్నాడు. ఒక్కోసారి ధిక్కరిస్తున్నాడు.

మొన్న ఎన్నికల్లో ఉత్తరప్రదేశులో బీజేపీ ప్రభ తగ్గడానికి కారణం యోగి నాయకత్వమే అనే అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నాడు.

గెలిచిన కొన్ని సీట్లూ బీజేపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల తప్ప యోగి వల్ల కాదంటున్నాడు.

అలా పక్కనే ఉంటూ తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు మౌర్య. యోగి దీనిని ఎలా ఎదుర్కుంటాడా అందరూ చూస్తున్నారు.

అసలీ కేశవ్ ప్రసాద్ మౌర్య ఎవరు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఎదిగి ఉపముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు? కాస్త వెనక్కి వెళ్లి చరిత్ర చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

1980ల్లో ప్రయాగరాజ్ (అలహాబాద్)లో బుక్కల్ మహరాజ్ అనే పెద్ద డాన్ ఉండేవాడు. అతని అసలు పేరు వశిష్ఠ నారాయణ్ కర్వారియా. అతనొక బ్రాహ్మణుడు. తెలుగువారికి ఇక్కడొక ప్రశ్న తలెత్తొచ్చు. బ్రాహ్మణుడేవిటి? డాన్ ఏవిటి అని! ఎందుకంటే దక్షిణభారతదేశంలో బ్రాహ్మణులు మనకి అలా కనపడరు. ఇక్కడి సినిమాల్లో కూడా బ్రాహ్మల్ని కమెడియన్స్ గానో, భయస్తులుగానో చూపిస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ బ్రాహ్మలు పూర్తి భిన్నం. వాళ్లల్లో కరడు కట్టిన డాన్ లు, నేరస్థులు, రాజకీయనాయకులు, ఇల్లీగల్ వ్యాపారులు ఉన్నారు. ఆ పరిస్థితికి కారణాలు సామాజిక పరిస్థితులా, జెనెటిక్సా అనేది పక్కనపెట్టి, అసలు కథలోకి వెళ్దాం.

బుక్కల్ మహరాజ్ పేరు చెబితే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులే భయపడేవారు. అతనొక సాండ్ మాఫియా కింగ్ పిన్.

అతీక్ అహ్మద్ పేరు వినే ఉంటారు. ఈ మధ్యనే యోగి సర్కారులో కాల్పుల్లో చనిపోయాడు. అతని చావు వీడియోలో రికార్డ్ అయ్యింది. దేశమంతా చూసింది. ఆ అతీక్ అహ్మద్ అప్పట్లో బుక్కల్ మహరాజ్ వద్ద గూండాగా పని చేసేవాడు.

అదలా ఉంటే, అప్పటి సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే జవహర్ యాదవ్ కి బుక్కల్ మహరాజ్ కి ఏదో విషయంలో గొడవ మొదలైంది. అది క్రమంగా ముదిరి వైరంగా మారింది. అదే సమయంలో అతీక్ అహ్మద్ తో కూడా బుక్కల్ మహరాజ్ కి తేడా వచ్చింది. మొత్తానికి 1991లో బుక్కల్ మహారాజ్ ని అతీక్ అహ్మద్ చంపేసాడు. అతని ఇల్లీగల్ వ్యాపారాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ చావు వెనుక జవహర్ యాదవ్ హస్తం కూడా ఉందని కొందరు నమ్మారు.

1996లో ప్రయాగని ఒక సంఘటన వణికించింది. మారుతి కారులో జవహర్ యాదవ్ ప్రయాణిస్తున్నాడు. అంతలో ఒక వ్యాన్ ఆ కారుని ఓవర్ టేక్ చేసి అడ్డంగా ఆగింది. మారుతి కారుకి బ్రేక్ పడింది. వ్యానులోంచి ఒక వ్యక్తి దిగాడు. ఆటోమేటిక్ గన్ ఎక్కుపెట్టి జవహర్ ని టపటపా కాల్చి చంపాడు. ఆ కాల్చిన వాడు ఉదయ్ భాన్ కర్వారియా. అతను చనిపోయిన బుక్కల్ మహారాజ్ కొడుకు.

ఇంత జరిగినా ఉదయ్ భాన్ బీజేపీ టికెట్ మీద ఎన్నికల్లో నిలబడ్డాడు. బారా నియోజకవర్గం నుంచి 2002లోనూ, 2007లోనూ వరుసగా రెండు సార్లు గెలుపొందాడు. అతను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం జవహర్ యాదవ్ హత్య కేసు అటకెక్కేలా చేసాడు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఉదయ్ ప్రభ సాగింది.

2012-2017 మధ్య అఖిలేష్ హయాములో జవహర్ యాదవ్ హత్య కేసుకి సంబంధించిన ఫైలు మళ్లీ తెరుచుకుంది. ఆ కేసు నడిచి 2019లో ఉదయ్ భాన్ తో పాటు అతని సోదరుడు సూరజ్ భాన్ కర్వారియాకి కూడా జీవితఖైదు పడింది.

తాము జైల్లో ఉన్నా తన తండ్రి చావుకి కారణమైన అతీక్ అహ్మద్ ని కూడా మట్టుబెడతామని ఈ అన్నదమ్ములిద్దరూ ప్రతిజ్ఞ చేసారు.

కాలక్రమంలో 2023 ఏప్రిల్ లో అతీక్ అహ్మద్ తలలో కెమెరా సాక్షిగా బులెట్ దిగింది. దానికి జైల్లో ఉండే ఉదయ్ భాన్ పథకం రచించాడని కొందరు, కాదు యోగి సర్కార్ చర్య అని కొందరు, ఈ ఇద్దరికీ సంబంధం లేని వేరే వర్గం పని అని కొందరు చెబుతారు.

సరే ఇంతకీ ఈ కథకి ప్రస్తుత యూపీ డెప్యుటీ సీయం కేశవ్ ప్రసాద్ మౌర్యకి లింకేంటి? కేశవ్ ప్రసాద్ రాజకీయంగా ఎదగడం మొదలుపెట్టింది ఉదయ్ భాన్ అరెస్టు తర్వాత నుంచే. ఉదయ్ భాన్ ఉన్నంతకాలం ఇతనికి ఎదుగుదల లేదు. పైగా ఉదయ్ భాన్ వర్గమంటే మౌర్యకి భయం.

ఉత్తరప్రదేశులో పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే… జైల్లో ఉన్న ఉదయ్ భాన్ కర్వారియాకి ఆ రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం.

8 ఏళ్ల తర్వాత ఉదయ్ బయటికొస్తున్నాడు. ఎందుకు విడుదల చేస్తున్నారు అంటే…జైల్లో సత్ప్రవర్తనతో ఉన్నాడని, అదే అతని విడుదలకి అర్హత అని చెబుతోంది యూపీ ప్రభుత్వం. కనుక ఉదయ్ ని విడుదలయ్యేలా చేసిందే యోగి అని సంకేతాలు వెళ్లాయి. ఉదయ్ బయటుంటే మౌర్య చెప్పుచేతల్లో ఉంటాడని యోగి ఎత్తుగడ అని చాలామంది నమ్ముతున్నారు.

కాషాయం ధరించే సాధువైనా రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుందేమో! ఉత్తరప్రదేశులో యోగీ హయాములో జరిగిన ఎన్-కౌంటర్లు అన్నీ ఇన్నీ కావు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ ని ఏరి పారేసే పనిలో తన రాజకీయానికి అడ్డొచ్చే కొన్ని శక్తుల్ని కూడా యోగి తీసేసాడంటారు! కానీ తన రాజకీయానికి పనికొచ్చే ఏంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మాత్రం జైల్లోంచి విడుదల చేయిస్తాడని కూడా అంటున్నారు.

ఈ కథంతా ఇంకాస్త లోతుగా తెలుసుకుంటే రామగోపాల్ వర్మ రక్త చరిత్ర పార్ట్ 3 కూడా తీస్తాడేమో!

27 Replies to “కరడుగట్టిన బ్రాహ్మణ డాన్ విడుదల”

  1. RR+YSR+జగన్ లాగా పాలిటిక్స్ లో కొంతమంది వెకిలి వెధవలు ఉంటారు !! అందరి పాపం పండుతుంది, ఇప్పుడు జగన్ వంతు !!

  2. నిజమే. వర్మ కు ఆంధ్ర లొ తీయడానికి ఏమీ లేదు కనుక రక్త చరిత్ర 4 సినిమా UP రాజకీయాల మీద తీయాల్సిందే.

  3. యూపీ లో బ్రాహ్మణ డాన్ లని పని కట్టుకొని యోగి ఆదిత్యనాథ్ లేపేశాడని, అందుకని బ్రాహ్మణులు కోపం తెచ్చుకున్నారు అని మీ ఆస్థాన రచయిత రాస్తారు, బురద చల్లుడు ముఖ్యం, ఎలా వీలుంటే అలా చల్లేయ్యాలి

  4. ఎవరి కోసం ఈ కథ వెంకట రెడ్డి గారు..ఇక్కడ మీరు చెప్పాలనుకుంటున్నారు? అటువంటి వాళ్ళు అన్ని చోట్లా ఉన్నారు..మీకు తెలియదు.అంతే.

  5. ///కరడుగట్టిన బ్రాహ్మణ డాన్ విడుదల///

    ఇక్కడ కులం అంత అవసరమా?

    కుల పిచ్చి ని GA ని విడతీయలెము.

    1. ఈ రెడ్లకి ఉండే కులపిచ్చి ఇంకా ఎవ్వరికి ఉండదు. పైకి వేదాంతుల్లా పోజులు, ప్రతి ఒక్కరి పేరుకు వెనకనే రెడ్డి అని టాగ్.

      మళ్ళీ ఎక్కడ బయటపడుద్దో అని వేరేయ్ కులం వైపు వేలెత్తి చూపిస్తారు కులపిచ్చి అని..

  6. ఇందులో తప్పేముంది, ఒక ఫాక్షనిస్టు కొడుకునూ మనమడునూ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలు ఉన్న దేశంలో

    59 మందిని కోయంబత్తూరు బాంబుదాడిలో చంపిన అబ్దుల్ నాసర్ మదానీ విడుదల కోసం తమిళనాడు కెరళ అసెంబ్లీలలోనే తీర్మానం చేసిన పార్టీలను ఎన్నుకున్న ప్రజలు ఉన్నదేశంలో

    గూండాలకూ నీచులకూ కులాన్ని బట్టి ఓటేసే దౌర్భాగ్యులు ఉన్న దేశంలో

    ఉగ్ర్తవాదులకు మతం లేదంటూ శాంతిసూక్తులు వల్లించే నీచులను ఎన్నుకునే దేశంలో

    ఒక గూండాను విడుదల చేస్తే తప్పు కనిపించిందా ?

    నైతికవిలువలు కేవలం బీజేపీ నే పాటించాలా ?

    నీతిలేని జాతిని మెప్పించటానికి నీతినియమాలు వదలివేస్తే మోక్షం

  7. ఇందులో తప్పేముంది, ఒక ఫాక్షనిస్టు కొడుకునూ మనమడునూ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలు ఉన్న దేశంలో

    59 మందిని కోయంబత్తూరు బాంబుదాడిలో చంపిన అబ్దుల్ నాసర్ మదానీ విడుదల కోసం తమిళనాడు కెరళ అసెంబ్లీలలోనే తీర్మానం చేసిన పార్టీలను ఎన్నుకున్న ప్రజలు ఉన్నదేశంలో

    గూండాలకూ నీచులకూ కులాన్ని బట్టి ఓటేసే దౌర్భాగ్యులు ఉన్న దేశంలో

    ఉగ్రవాదులకు మతం లేదంటూ శాంతిసూక్తులు వల్లించే నీచులను ఎన్నుకునే దేశంలో

    దేశద్రోహులను స్వార్ధప్రయోజనాల కోసం మద్దత్తు ఇచ్చే నీచులకు ఓటేసే సన్నాసులు ఉన్న దేశంలో

    ఒక గూండాను విడుదల చేస్తే తప్పు కనిపించిందా ?

    నైతికవిలువలు కేవలం బీజేపీ నే పాటించాలా ?

    నీతిలేని జాతిని మెప్పించటానికి నీతినియమాలు వదలివేస్తే మోక్షం

      1. ఇందులో తప్పేముంది….మాధవరెడ్డి కొడుకు 3 శాఖలకు మంత్రి అవ్వలే

      2. ఇందులో తప్పేముంది….మాధవరెడ్డి కొడుకు 3 శాఖలకు మంత్రి అవ్వలే

    1. మీ సారుకి సమాధానం దొరకనప్పుడు నెహ్రూని, గాంధీని నిందిస్తూ జవాబు దాటవేస్తారు. మీరు కూడా అదే దారిలో ఓటర్లను నిందిస్తూ పొడుగాటి వ్యాసాలు రాస్తారు. మీరు ఉదహరిస్తున్న ఫ్యా*క్ష*ని*ష్టు మనవడితో పదేళ్లుగా తెరవెనుక స్నేహం జరిపి, బోలెడన్ని సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకున్నది పెద్దమనిషి ఎవరో మరి‌‌?

    2. Puskarallo 29 members. Road show lo about 8 members ni indirect GA, Madhav Reddy balayogi lantollani direct gaa, addam vunna some 10’s of people Ni anyayanga pottanettukunnodni koodaa add cheyyaraa de.

    3. మీకు తెలుసా ? వాషింగ్మెషిన్ రేట్స్ చాలా తగ్గాయి, ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లో సరసంగా లభిస్తున్నాయి

  8. రెంట మతం “reddy”, కరుడు కట్టిన కమ్మ, పీకkose కాపు ఎప్పుడో release అయ్యారు AP లో, UP వెనకబడిన రాష్ట్ర ఈ విషయం లో.

  9. తమ పార్టీలో ఒక్క నేరస్థుడి మీదకూ బుల్డోజరు పంపిన దాఖలాలు లేవు, దుష్టశిక్షణ ప్రతిపక్షాలకే పరిమితం, తమ పార్టీలో చేరితే సుదర్శన చక్రం అడ్డువేసి మరీ కాపాడుకోవడం, అదే ఉత్తమప్రదేశ రాజకీయం..

    1. మీకు తెలుసా ? వాషింగ్మెషిన్ రేట్స్ చాలా తగ్గాయి, ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లో సరసంగా లభిస్తున్నాయి

  10. కరుడు కట్టిన అన్నం గురించి విన్నాను, బెమ్మడూ కరుడు కడతాడా?ఈ రచయితకి చిన్నప్పటి నుండి మాడిన మిగులు అన్నం తినడం అలవాటు ఏమో?

Comments are closed.