సరిగ్గా ఐదేళ్ల కిందట.. అప్పుడు కూడా ప్రధానమంత్రి హోదాలోని నరేంద్రమోడీని అప్పటి ఏపీ సీఎం హోదాలో, తెలుగుదేశం జాతీయాధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు అనని మాటంటూ లేదు! మోడీని అప్పుడు ఇష్టానుసారం తెగనాడారు చంద్రబాబు నాయుడు! మోడీని ఉగ్రవాది అని కూడా అన్నారు. అంతటితో మొదలుపెడితే.. మోడీ వ్యక్తిగత జీవితం గురించి కూడా ఇష్టానుసారం వ్యాఖ్యానించారు!
అంతేనా.. మోడీకి కుటుంబం లేదని, తనకు కుటుంబం ఉందంటూ చెప్పుకొచ్చారు! మోడీ భార్యను వదిలేశాడని, మోడీ బాధ్యత లేని వ్యక్తని, తనకు కుటుంబం ఉందని, తనకు కుటుంబం ఉందంటూ గర్విస్తానంటూ తోచినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతేనా.. మోడీ పై ఈ దేశంలో పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తను మాత్రమేనంటూ కూడా డబ్బా కొట్టుకున్న ఘన చరిత్ర చంద్రబాబుది!
మరి అప్పుడేమో మోడీని ఇష్టానుసారం తిట్టి, హద్దంటూ లేకుండా.. తెగ రెచ్చిపోయి, మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసి, వ్యక్తిగతంగా తను మోడీ కన్నా గొప్ప అంటూ డబ్బా కొట్టుకుని, తనకో భార్య, మనవడు ఉన్నాడంటూ అర్థం లేకుండా చెప్పుకుని.. మోడీపై ఈ దేశంలో పోరాడేవాడెవడైనా ఉన్నాడంటే అది తననేనంటూ చెప్పుకుని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పప్పెట్ లా మాట్లాడుతున్నారు!
మోడీపై విపరీతమైన పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉన్నారు! మరి సరిగ్గా గత ఎన్నికలకూ, ఇప్పటి ఎన్నికలకూ చంద్రబాబు తీరులో ఇదీ తేడా! ప్రతి ఐదేళ్లకూ ఇలాంటి అవకాశవాదాన్ని ఏదో ఒకటి ప్రదర్శించడం ఆయనకు అలవాటే! అయితే.. ఈ వేషాలన్నీ చూసి జనాలు విసిగెత్తిపోయారు. అందుకే ఇప్పుడు ఛీ.. ఛీ.. అనే చీదరింపు కనిపిస్తూ ఉంది.
ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ.. ఒక వ్యక్తిత్వం లేకుండా, ఒక రాజకీయ సిద్ధాంతం లేకుండా, తన వయసు కు కూడా ఒక గౌరవాన్ని కోరుకోకుండా, మాటెత్తితే 14 యేళ్ల పాటు సీఎం, 14 యేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నేతనంటూ చెప్పుకుంటూ.. మరీ ఇంత పచ్చి అవకాశవాదాన్ని నిస్సిగ్గుగా, బేషరమ్ తో చాటడం చంద్రబాబుకే సాధ్యం అవుతోంది. ఎన్నికల్లో గెలుపోటముల మాటెలా ఉన్నా.. చంద్రబాబు నిస్సిగ్గుతనం మాత్రం ఇలా బజారున పడుతూ ఉంది. బహుశా చంద్రబాబు దిగజారడానికి కూడా ఇంతకన్నా లోతులు లేవేమో! ఇది పరాకాష్ట!