దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,542 మంది వైరస్‌ బారిన పడగా, 27 మంది మృతిచెందారు. దీంతో దేశంలో…

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,542 మంది వైరస్‌ బారిన పడగా, 27 మంది మృతిచెందారు. దీంతో దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య 63,562కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో వైర‌స్ నుండి 8,175 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని..  రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్టా కేంద్రం ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈనెల 10, 11వ తేదీల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది.

దేశంలో మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే దేశ రాజ‌ధాని ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేట్ 26.54 శాతాం ఉంది. స‌గ‌టున రోజూ వెయ్యికి పైనే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి.