‘గద్దె’ దిగిన తరువాత కానీ…!

అధికారాంతమందు చూడవలె అన్నది పెద్దల మాట. ట్విట్టర్ సంస్ధ‌లో అధికారంలో వుండగా గద్దె విజయ చేసిన కార్యక్రమాల చిట్టా ఇప్పుడు బయటకు వస్తోంది. సోషల్ మీడియా అంటే నికార్సు..మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మేనేజ్…

అధికారాంతమందు చూడవలె అన్నది పెద్దల మాట. ట్విట్టర్ సంస్ధ‌లో అధికారంలో వుండగా గద్దె విజయ చేసిన కార్యక్రమాల చిట్టా ఇప్పుడు బయటకు వస్తోంది. సోషల్ మీడియా అంటే నికార్సు..మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మేనేజ్ చేసేయవచ్చు అనే భ్రమలు ఇప్పుడు తొలిగిపోతున్నాయి. 

ఏ వ్యవస్థను అయినా మేనేజ్ చేసేయగల చంద్రబాబు లాంటి మేధావులు వుంటే ఏదీ అసాధ్యం కాదు. అసలు విజన్ 2020 అంటేనే అది. ప్రతి వ్యవస్థలో కీలకస్థానంలో ‘మన వాళ్లు’ వుండాలి. అలా వుండడానికి మనం సహకరించాలి. అలా మన సహకారంతో అందలం ఎక్కిన వారు సమయం వచ్చినపుడు మనకు సహకరించాలి. ఇదే కదా విజన్ అంటే. ఈ పద్దతిలోనే కదా ప్రతి చోటా తమకు అనుకూలంగా, వైరి పక్షాలకు వ్యతిరేకంగా నెగ్గుకు వస్తోంది.

ట్విట్టర్ అక్కౌంట్లు ఎందుకు బ్లాక్ అవుతాయో? ఎవరు రిపోర్ట్ చేస్తారో? కొన్ని అక్కౌంట్లు ఎన్ని రిపోర్టులు కొట్టినా ఎందుకు బ్లాక్ కావో ఇలాంటి ప్రశ్నలు నెటిజన్లకు చాలా వున్నాయి. అసలు సోషల్ మీడియా సంస్థల నియమ నిబంధనలు అంత పట్టేవి కాదు. అర్థం అయ్యేవీ కాదు.

గద్దె విజయ ట్విట్టర్ సంస్థలో కీలక స్థానంలో వుండి చేసిన కార్యక్రమాల చిట్టా ఇప్పుడు ఒక్కొక్కటీ బయటకు వస్తోంది. అప్పట్లో వైకాపా అనుకూల అకౌంట్లు వందలకు వందలు బ్లాక్ అయిపోవడం వెనుక ఏదో శక్తి వుందనే అనుమానాలు వుండేవి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గద్దె విజయ చేసిన పనులు ఒక్కొక్కటీ బయటకు వస్తుంటే, వైకాపా జనాల్లో వున్న అనుమానాలు బలపడుతున్నాయి. ట్విట్టర్ ఇప్పుడు గదె విజయ్ ను జైలుకు పంపాలని హొరెత్తుతోంది. అమెరికా ఎన్నికల్లో వేలు పెట్టారని, కొన్ని ‘బ్లాకింగ్’ వ్యవహారాలు నడిచాయని బయటకు రావడంతో ‘గద్దె నుంచి జైలుకు’అనే విధమైన ట్రెండింగ్ మొదలైంది.

అంటే ట్విట్టర్ అనే వ్యవస్థను అడ్డం పెట్టుకుని జనాల రాజకీయ అభిప్రాయాలు బయటకు వ్యాప్తి కాకుండా అడ్డుకోవడం, తమకు అనుకూలమైన అభిప్రాయాలు వ్యాప్తి చేయడం అన్నవి జరిగాయని నమ్మాల్సి వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాటిని విత్తనాలు ఒక్కో వ్యవస్థలో బయటకు వస్తున్నాయి. ఇలా ఇంకెన్ని వున్నాయో…ఈ విత్తనాలు మొలకలెత్తి వాటికి అంట్లు కట్టినవి ఇంకెన్ని వున్నాయో? వీటన్నింటి నుంచి ఆంధ్ర జనాలకు విముక్తి ఎప్పుడో?