Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ అడ్డగోలు వాదనలు!

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ అడ్డగోలు వాదనలు!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజురోజుకూ కొత్త సంగతులు వెలుగులోకి వస్తుండడంతో.. గులాబీ నాయకులకు కంగారు పెరుగుతోంది. ఫోన్ టాపింగ్ వెనుక గులాబీ అగ్రనేతల ప్రమేయం ఉన్నదని ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న అధికారులు చెప్పిన నాటి నుంచి అందరి అనుమానాలు కేటీఆర్ వైపుగా వేలు చూపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో కేటీఆర్ పాత్ర గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. తన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేలాగా యూట్యూబ్ ఛానల్స్‌లోనూ, కొన్ని మీడియా సంస్థల కథనాల్లోనూ వస్తున్నదని ఆరోపిస్తూ కేటీఆర్ ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఫోన్ టాపింగ్ లో తన పాత్ర గురించి సమర్ధించుకోవడంలో ఆయనలో కంగారు కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన అంటున్నారు. వారి ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ నాకేముంది అని మాట్లాడుతున్నారు. ఈ విషయంలో లీగల్ గానే ప్రొసీడ్ అవుతా అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తన పేరు ముడిపెట్టి జరుగుతున్న ప్రచారంపై పరువునష్టం దావా వేస్తారట. అయితే, దావా వేయదలచుకున్నప్పుడు ఇప్పటికే బహుకాలంగా ఆయన పాత్ర గురించి ప్రచారం జరుగుతుండగా.. ఇంకా ఏం నష్టం జరగాలని ఎదురుచూస్తున్నారో తెలియదు. ఈ పాటికి దావా వేసే ఉండొచ్చు కదా.. అనేది ప్రజల సందేహం.

అదలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి.. కేటీఆర్ కొన్ని కొత్త డిమాండ్లను వినిపిస్తున్నారు. 2014లో అనగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పూర్వం, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. అప్పటి ప్రభుత్వంలోని కాంగ్రెస్ మంత్రులే కొందరు.. తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నట్టు అనుమానాల్ని వెలిబుచ్చారని, ఆతర్వాత ట్యాపింగ్ ఏదీ జరగలేదని కిరణ్ ప్రకటించినప్పటికీ.. దాని మీద ఇప్పుడు విచారణ జరగాల్సిందేనని కేటీఆర్ అంటున్నారు.

2014 లో కాంగ్రెస్ నాయకులే చేయించిన ఫోన్ ట్యాపింగ్ కూడా తేల్చాలంటున్నారు. అప్పటి వ్యవహారం గురించి ఒకరిద్దరి మాటలు తప్ప ఎలాంటి దాఖలాలు కూడా లేవు. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారు, అందుకు వాడిన ఎక్విప్ మెంట్ పెట్టుకున్న సెటప్ సహా పోలీసులకు దొరికిపోయారు.

ఇంత పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలతో సహా ట్యాపింగ్ చేసిన వారు దొరికిపోయిన సంఘటనలు దేశంలోనే మరొకటి లేదని వినిపిస్తోంది. ఈ వ్యవహారానికి పదేళ్ల కిందటి కేవలం ఆరోపణలతో పోల్చి విచారణకు డిమాండ్ చేయడం కేటీఆర్ లోని భయానికి చిహ్నంగా కనిపిస్తోంది. ట్యాపింగ్ వెనుక పార్టీ పెద్దలు ఎవరెవరున్నారో నిందితులు స్పష్టంగా వెల్లడించేవరకు ఎన్ని రకాలుగా అయినా దబాయించవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?