Advertisement

Advertisement


Home > Politics - Analysis

అమ్మను అడ్డుపెట్టుకుని కుటిలరాజకీయం! ఛీఛీ!

అమ్మను అడ్డుపెట్టుకుని కుటిలరాజకీయం! ఛీఛీ!

నారా లోకేష్ తల్లి గురించి అవమానకరంగా కొందరు వ్యక్తులు మాట్లాడారు. ఇది సభ్యసమాజం ఈసడించుకోవాల్సిన విషయం. శాసనసభలో కూడా అవమానకరమైన మాటలు మాట్లాడారు. వారిని కూడా అసహ్యించుకోవాల్సిందే. 

ఆ విషయమై చంద్రబాబునాయుడు మనస్తాపానికి గురయ్యారు. సభ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత.. ఆ ఉద్వేగంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దానిని కూడా అర్థం చేసుకోగలం. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలే మరింత అసహ్యం పుట్టిస్తున్నాయి. ప్రత్యేకించి నారా లోకేష్ అంటే ఏవగింపు, జుగుప్స పుట్టిస్తున్నాయి. జనంలో తనపట్ల అసహ్యం పరాకాష్ట రేంజిలో కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. 

అలాంటి మాటలు మాట్లాడిన అసలు వ్యక్తులు ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. వివాదం అక్కడితో సమసిపోయింది. కానీ.. అది అలా సమసిపోవడం నారా లోకేష్ కు ఏమాత్రం ఇష్టం ఉన్నట్టులేదు. ఆ అవమానకరమైన మాటల గాయాన్ని ఎప్పటికీ కెలుక్కుంటూ.. పుండు పచ్చిగా ఉండేలా జాగ్రత్తగా చూసుకుంటే తనకు ప్రజల సానుభూతి దక్కుతుందనే నీచమైన ఊహల్లో లోకేష్ ఉన్నట్టున్నాడు.

‘‘నా అమ్మ గురించి అవమానకరంగా మాట్లాడారు..’’ అనేది లోకేష్ కు ఒక అస్త్రంలాగా తయారైంది. జనం సానుభూతి, జాలి పొందాలని అనిపించినప్పుడు దానికి అమ్ములపొదిలోంచి తీసి ప్రయోగించడం అలవాటుగా మారింది. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఆ విషయం గురించి రెండు ముక్కలు మాట్లాడి.. ఆవువ్యాసం లాగా.. నారా లోకేష్ తిరిగి తన తల్లిని అవమానకరంగా మాట్లాడారంటూ వెగటుపుట్టించే మాటలు మాట్లాడుతుంటారు. 

తాజాగా తెలుగుదేశానికి గోరంట్ల మాధవ్ వ్యవహారం లడ్డూలా దొరికింది. గోరంట్ల మాధవ్ వ్యవహారమే లేకి పని. దానిని మరింత లేకి మాటలతో క్యాష్ చేసుకోవడానికి తెలుగుదేశం ఉబలాటపడిపోతూ ఉంది. వారిలో కూడా లోకేష్ ది అత్యుత్సాహం గనుక.. మాధవ్ గురించి విమర్శించే సందర్భాల్లోకి కూడా తన తల్లిని లాక్కొచ్చి నీచమైన పంచాయతీ చేస్తున్నాడు. 

మాధవ్ వ్యవహారాన్ని రచ్చకీడ్చి లబ్ధి పొందాలనుకోవడం రాజకీయంగా అర్థం చేసుకోవచ్చు. గతంలో అవంతి శ్రీనివాస్ గురించి, అంబటి రాంబాబు గురించి వచ్చిన విమర్శలను కూడా దీనికి ముడిపెట్టినా రాజకీయాల్లో అలాగే మాట్లాడతార్లే అనుకోవచ్చు. కానీ.. తన తల్లి గురించి అప్పట్లో వచ్చిన వ్యాఖ్యలను కూడా మళ్లీ చర్చకు తీసుకురావడం నీచమైన సంగతి కాక మరేమిటి?

లోకేష్ తల్లి గురించి అప్పట్లో వచ్చిన వ్యాఖ్యలు బహుశా ఆమెకు ఎంత క్షోభ కలిగించాయో మనకు తెలియదు గానీ.. లోకేష్ ఇలా తడవతడవకూ వాటిని గుర్తుచేస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజల్లో జాలి పుట్టించుకోవడం కోసం తనను బజార్లోకి లాగుతుండడం.. ఆ తల్లిని మరింతగా క్షోభ పెడుతూ ఉంటుంది. తల్లిని అడ్డం పెట్టుకుని ఇలా నీచరాజకీయం చేయాలని ప్రయత్నించేవారిని బహుశా మనం భవిష్యత్తులో కూడా చూడలేమేమో!! 

ఇప్పటికైనా లోకేష్ బుద్ధి తెచ్చుకుని తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఎన్ని రకాల విమర్శలు చేసినా.. మధ్యలోకి తన తల్లిని లాగకుండా రాజకీయం చేస్తే బాగుంటుంది. ఆ మాటలే మాకు బ్రహ్మాస్త్రం అని వారనుకుంటే.. వారి ఖర్మ.. మనం ఏం చేయలేం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?