జనసేన టికెట్ మీద ఎవరెవరు పోటీ చేస్తారు అన్నది చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలిన స్థానాలు చాలా అంటే చాలా తక్కువ. వాటిల్లో పవన్ పోటీ చేయడానికి వీలున్న ప్లేస్ ఓక్క పిఠాపురం మాత్రమే.
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లు పిఠాపురం నుంచే పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే టైమ్ లో పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేయరని, ఎంపీగా పోటీ చేసి, కేంద్రంలో మంత్రి పదవి చేపడతారని మరో వెర్షన్ వినిపిస్తోంది.
ఈ రెండింటిలో ఏది జరుగుతుంది అన్నది రేపటికి క్లారిటీ వచ్చేస్తుంది. పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అది ఎక్కడి నుంచి అయినా ఓకె. అలా కాకుండా ఎంపీగా పోటీ చేస్తే మాత్రం జనసేనకు మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు.
అధికారానికి టార్గెట్ చేయకుండా, చెప్పుకోదగ్గ సంఖ్యలో పోటీ చేయకుండా వున్న కారణం గానే కాపుల్లో కొంత అసంతృప్తి వుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకపోతే, పవన్ కు ఎప్పటికీ ఆంధ్రలో అధికారం చెేపట్టడం మీద దృష్టి పెట్టరనే అనుమానాలు పెరుగుతాయి.
ఎప్పటికీ తెలుగుదేశం పల్లకీ మోయడానికి జనసేనను వాడేస్తారనే భయం పెరుగుతుంది. దానివల్ల జనసేన అభ్యర్థుల విజయవకాశాలు బాగా ప్రభావితం అవుతాయి. ఈ సంగతి పవన్ కు తెలియకుండా వుండదు. తెలిసి కూడా పోటీ చేయకపోతే అనుమానించాల్సి వస్తుంది. పోటీ చేస్తే మాత్రం పిఠాపురంలో మా రంజుగా వుంటుంది ఎన్నిక వ్యవహారం.