Advertisement

Advertisement


Home > Politics - Analysis

రాయలసీమ కష్టాలు..లోకేష్ మాటలు

రాయలసీమ కష్టాలు..లోకేష్ మాటలు

తన పాదయాత్రలో రాయలసీమ కష్టాల చూసి చలించిపోయానని, తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో ఆటో మైబైల్ పరిశ్రమలు ఏర్పాటు చేసి, అభివృద్ది సాధిస్తామని తెలుగుదేశం చినబాబు లోకేష్ చెప్పారు. 

మళ్లీ ఆయనే మరో మాట కూడా అన్నారు. రాయలసీమ అంటే కియా గుర్తుకు వస్తుందన్నారు. అసలు రాయలసీమ ఎవరి హయాంలో ఎన్నాళ్లు వుంది? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరకాలం ముఖ్యమంత్రిగా వున్న ఘనత ఎవ్వరిది? చంద్రబాబుది కాదా? దానికి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ పాలనా కాలాన్ని కూడా కలపండి. ఇప్పుడు చెప్పండి. ఇన్నేళ్ల పాలనలో రాయలసీమకు తెలుగుదేశం ఏమీ చేయలేదా?

కేవలం నాలుగేళ్ల పాలనలో జగన్ చేయలేదు అని ఆడిపోసుకోవడం కాదు. తాము ఎన్నేళ్లు పాలన సాగించాం. ఏం సాధించాం అన్నది కూడా చూసుకోవాలి కదా? మరి తాము దశాబ్దాల కాలం పాటు పాలన సాగించి, సాధించలేనిది జగన్ నాలుగేళ్లలో సాధించేయాలని లోకేష్ కోరుకోవడాన్ని ఏమనాలి?

ఆ ముచ్చట అలా వుంచుదాం. ప్రభుత్వం తరపును బోలెడు రాయతీలు ఇచ్చి కియాను తెచ్చారు. మరి అయినా రాయలసీమ వెనుకబాటు తనం పోలేదా? మరి అలాంటపుడు ఇంకెందుకు కోట్ల విలువైన రాయతీలు ఇవ్వడం?

ఇంటింటికి కుళాయి ఇస్తా అంటున్నారు. మరి బాబుగారి సుదీర్ఘ పాలనలో ఎందుకు ఈ పని చేయలేదు. అంటే అప్పుడు అవసరం అనిపించలేదా? లేక చేయడం చేతకాలేదా? అప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తారని జనం నమ్మాలా? చినబాబు మాట్లాడే ముందు కచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ రాష్ట్రాన్ని చిరకాలం పాలించింది తన తండ్రే..తన పార్టీయే అని. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?