Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆర్ఆర్ఆర్.. నైతికత కు కేరాఫ్ అడ్రస్

ఆర్ఆర్ఆర్.. నైతికత కు కేరాఫ్ అడ్రస్

చిరకాలంగా వైకాపాకు ఒకటే చెవిలో జోరిగ మాదిరిగా గోల. ఆర్ఆర్ఆర్ అనే రఘురామకృష్ణం రాజుతో రోజు లొల్లి. పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు, రచ్చబండ. మర్నాడు ఎల్లో మీడియాలో రాసుకునేందుకు బ్యానర్ వార్తలు అవే. రోజు ఇదే గోల.

గమ్మత్తేమిటంటే పార్టీ నుంచి వెళ్లిపోయి ఇదంతా చేస్తే వేరు. కానీ పార్టీ నుంచి వెళ్లరు. పదవికి రాజీనామా చేయరు. మీసాలు మెలేస్తారు. తొడకొడతారు. బస్తీమే సవాల్ అంటారు. వైకాపా కూడా తగ్గలేదు. కేసుల పెట్టింది. కొట్టించారనే వదంతలు వున్నాయి. ఈ మంచి రసవత్తర డ్రామా ఇన్నాళ్లుగా నడచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వెళ్లి ఎల్లో కండువా కప్పుకుని చంద్రబాబు దేవుడని అనడంతో ముగిసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే, తనకు ఎంపీ టికెట్ ఇప్పించలేని చంద్రబాబు పోలవరం ఎలా కడతారు.. అని ఆర్ఆర్ఆర్ నిలదీసారు. తనకు టికెట్ ఇప్పించాల్సిన బాధ్యత ఆయనదే అన్నారు.

అంటే ఆర్ఆర్ఆర్ కొన్నేళ్ల పాటు జగన్, వైకాపాల మీద పడి నానా యాగీ చేయడం వెనుక ఎవరు వున్నారు అన్నది క్లారిటీగా తెలుస్తోంది కదా? ఇదంతా నైతికత అనుకోవాలా? పార్టీ నచ్చకపోతే బయటకు వెళ్లాలి. వెళ్లకుండా పదవీకాలం అంతా అనుభవించి రాజీనామా చేయడం ఏ మేరకు నైతికత అవుతుంది. అదే విధంగా భాజపా టికెట్ ఆశించారు. అది రాలేదు. దాంతో తేదేపాలో చేరారు. అది ఏ విధంగా నైతికత అనుకోవాలి?

వైకాపా నచ్చనపుడే రాజీనామా చేసి, ఇష్టం వచ్చిన పార్టీలో చేరవచ్చు. అక్కడ టికెట్ రాకుంటే వేరే చోటకు వెళ్లవచ్చు. రాజకీయ వేత్తలకు అది కామన్ థింగ్. అందులో సందేహం లేదు. కానీ ఆర్ఆర్ఆర్ చేసిన వ్యవహారాలు అన్నీ నైతికత అని ఎలా అనిపించుకుంటాయి? టికెట్ హామీ నెరవేర్చలేని వారు పోలవరం హామీ ఎలా నెరవేరుస్తారు అని చంద్రబాబును నిలదీసినపుడే ఆర్ఆర్ఆర్ వెనుక ఎవరు వున్నారు? ఆయన ఏ హామీ ఎవరు ఇచ్చారు అన్నది అర్థం అయింది. ఆర్ఆర్ఆర్ నోటికి జడిసి, రచ్చకెక్కితే భరించలేమని తెలిసి, ఇప్పుడు చంద్రబాబు కిందా మీదా పడి తన పార్టీలో చేర్చుకుని మరీ టికెట్ ఇవ్వాల్సి వస్తోంది.

రాజకీయాల్లో ఏదైనా చల్తా అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తూ, తాము నీతిమంతులము అని చెప్పుకునేవారు మాత్రం ఇలా చేస్తూ, అదే నైతికత అంటూ, దాన్నే ప్రచారం చేస్తూ వుంటే హ్యాట్సాప్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?