గురువు కన్నా శిష్యుడే బెటర్

కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో ప్రకటించిన మేనిఫెస్టోనే తెలంగాణలో కూడా ప్రకటించింది. భాజపా కూటమిలో చేరిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణలో విజయవంతమైన ఎన్నికల ఫార్ములా…

కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో ప్రకటించిన మేనిఫెస్టోనే తెలంగాణలో కూడా ప్రకటించింది. భాజపా కూటమిలో చేరిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణలో విజయవంతమైన ఎన్నికల ఫార్ములా ఆంధ్రలో కూడా విజయవంతమైంది. ఇది వరకు బాగానే ఉంది. కానీ అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ఎలా అమలు చేస్తారు అనే అనుమానం ఉంచుతోంది.

ఇప్పటికే ఉన్న జగన్ అమలు చేసిన పథకాలు, దానికి తోడు ఈ కొత్త పథకాలు.. అన్నీ ఎలా అమలు అవుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్నట్లుగా చంద్రబాబు శ్వేతపత్రాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికీ పసుపు పత్రికలన్నీ జగన్ వ్యతిరేకతతో నిండి ఉన్నాయి, కొత్త ప్రభుత్వం చేసిన పనుల వివరాలతో కాదు.

తెలంగాణ విషయానికి వస్తే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ పథకాన్ని అమలు చేశారు. కానీ ఆంధ్రలో దానిని పట్టించుకోలేదు. విధి విధానాలు అనే సాకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో అమలు చేస్తున్నారు కనుక, మోడల్ ఉంది. కానీ చంద్రబాబు దాని అమలుకు ముందుకు రాలేదు.

రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించారు. అది చేయలేరని అందరూ అనుకున్నారు, కానీ చేశారు. చంద్రబాబు 15 వేల రూపాయల అమ్మ ఒడి/తల్లికి వందనం పథకాన్ని ఏడాది వెనక్కి వేశారు.

రేవంత్ రెడ్డి రైతు బంధు కిందా మీదా పడి ఏదో విధంగా సెట్ చేసారు. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి. ఇప్పటి వరకు చంద్రబాబు చేసినది ఒక్కటే: పెంచిన పింఛను అమలు చేయడం. అది తప్ప మరో రూపాయి సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. నెలన్నర పాలనలో జగన్‌ను విమర్శించడమే జరుగుతోంది. ఉచిత ఇసుక అన్నారు, ఇప్పుడు ఆంధ్రలో రేటు పెరిగింది.

వాలంటీర్లకు పదివేల జీతం అన్నారు. మొత్తం వ్యవస్థనే పక్కన పెట్టారు. ఉద్యోగులను ఎంత రెచ్చగొట్టాలో అంతా రెచ్చగొట్టారు. జీతాలు రావడం లేదు, పింఛన్లు ఇవ్వడం లేదని. కానీ ఇప్పటి వరకు ఒక్క నెల జీతం లేదా పింఛన్లు బకాయి లేదు. అది వేరే సంగతి. కానీ తాము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కదా, డి.ఎ. బకాయిలు వస్తాయోమో అని ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు. ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి ప్రకటన లేదు.

చూస్తుంటే జగన్ ప్రవేశపెట్టిన మరే పథకం కూడా ఇప్పట్లో అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కనిపిస్తోంది. ముఖ్యమైన పథకాలు అమలుకు మరో ఏడాది పడుతుంది.

ఇక్కడ చంద్రబాబు ధైర్యం ఏమిటంటే, ఎన్నికలు మరో అయిదేళ్ల వరకు లేవు. అందువల్ల ఇప్పుడే అమలు చేసినా, రెండేళ్ల తరువాత అమలు చేసినా ఒకటే. చివర్లో అమలు చేసినా, ప్రజలు హమ్మయ్య అనుకుంటారని ధీమా. జగన్ చేసిన తప్పు అదే, అన్నీ ఒకేసారి అమలు చేసేసారు. ప్రజలు కొత్త పథకాల కోసం చూసి, చంద్రబాబు వైపు మొగ్గారు.

పైగా చంద్రబాబు అమలు చేయడం లేదు, మోసం చేసారు అని రాసే మీడియా లేదు కదా. నిత్యం ఇంకా ఇప్పటికీ జగన్ దోచేసారు అనే వార్తలు రాయడం జరుగుతోంది. అందువల్ల ప్రజలు చంద్రబాబు కేసి చూస్తూ కూర్చోవడం తప్ప వేరే దారి లేదు.

28 Replies to “గురువు కన్నా శిష్యుడే బెటర్”

    1. అదే కదా.. అందరూ అనుకుంటున్నారు.. బొల్లి గడు ఇచ్చిన హామీలకు ఓట్లు రాలలేదు.. అందుకనే.. వాడే.. ఓట్లు గుద్దేసుకున్నాడు అని.. ఈ.V. ఎం లను మార్చుకుని ఇప్పడు నువ్వు అదే చెప్తున్నావ్.

      1. 2029 లో కూడా అలాగే చేస్తే మన పార్టీ సంగతి ఏమవుతుంది అబ్బా?

  1. జగన్ కాంగ్రెసు లో కావాలని ఉబలాట పడుతున్నాడట గద అందుకేనేమోRevanth reddy పైన ఈ పాజిటివ్ artcle😀

  2. పోనీలే.. వీళ్ళిద్దరికన్నా.. 11 సీట్లు వచ్చిన జగన్ రెడ్డి బెటర్ అని రాసుకోలేదు.. అక్కడితో వదిలేయ్..

    1. హామీ ఇచ్చేటప్పుడు కర్ణాటకలో తెలంగాణ లో Problems ఉన్నాయని తెలియద ర B 0 G@M? ఈ రోజు అధికారం పొందక ఎగొట్టటానికి సొల్లు DE N`Gతున్నావ్

  3. మరి శిష్యుడు అక్కడ ఢిల్లీ లో ధర్నా చేస్తుంటే.. ఆయన దత్త తండ్రి, గురువు మాత్రం ఎందుకు మద్ధతు తెలపలేదో మరి..

    ఈ విషయం లో మాత్రం గురువే బెటర్.. ఆల్రెడీ కూతురిని జైలు పాలు చేసుకొన్నాడు.. కొడుకుని కూడా పోగొట్టుకోడానికి “సిద్ధం” లేడేమో మరి..

    శిష్యుడు మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు.. తొందర్లో బొక్కలో వేసి భోగి పండగ చేసేస్తారు..

  4. జుట్టు ఉంటే ఎన్ని రకాలుగా అయినా కొప్పు వేసుకోవచ్చు, అలాగ ఒక హైదరాబాద్, బెంగళూరు లాంటి సంపద ఉన్నవాళ్లు ఎన్ని సంక్షేమ వేషాలు అయినా వేస్తారు.

  5. “దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈవిషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాశ్‌ పూరీ కాదని.. ఆకాశ్‌ చపాతీ‌ అని ప్రకటించారు”

  6. బుడ్డార్ ఖాన్ 6 నెలల్లో అమలు చేశాడు.. వీళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా.. atleast 2 months పడుతుంది మంత్రులు అందరూ వారి వారి శాఖల్లో సెటిల్ అవ్వటానికి

  7. ఆలా అనుకున్న ఎవ్వరికి నష్టం లేదు… కానీ అన్న కన్నా అక్కే నయం అనుకున్నారో అప్పడమే …ఇంకా

  8. తల్లికి వందనం హామీ అటకెక్కింది…

    తండ్రికి ఇంధనం హామీ ఎక్కడివరకు వచ్చిందో జాడ లేదు.

    బూమ్ బూమ్ ని 999 పౌరులే!ని స్టార్ కింద మార్చేసి చేతులు దులుపుకున్నారు.

    ఆన్లైన్ లో ప్రభుత్వానికి టన్నుకు 350/- కడితే వచ్చే ఇసుకని

    ఉచితం పేరుతో టన్నుకు 1200/- అయ్యేలా సీనరేజి కవరింగ్ మొదలెట్టారు.

    ఉచితం అంటే ప్రభుత్వానికి ఏమి రాదు….అంతా గుల కమిటీలకే.

    ఇంటింటికి పెన్షన్ అని వీధి చివర గుల కమిటీ వాళ్ళతో 100-500 భ్రమరావతి ఇటుకల కోసం కోసేస్తున్నారు.

    మొన్న విద్యుత్ చార్జీల గురించి గంట సొల్లు చెప్పాడు బాబు.

    మరి మీరు తగ్గిస్తున్నారా అంటే…నీళ్లు నమిలి…

    సర్ ఛార్జ్ లేకుండా బొగ్గు ఎలా కొనాలి అని జగన్ చేసిందని కరెక్ట్ అని ఒప్పుకున్నాడు.

    మాల వేసుకొని ప్రజలని మోసం చేస్తున్నారు.

    అబద్దాలు అలవోకగా చెప్పేస్తున్నారు.

    ఒక్క ఇటుక కూడా పెట్టకుండా ఉద్దానం నీటి పథకానికి పేర్లు వేసుకున్నారు.

    ఇన్నాళ్లు చక్కగా ప్రభుత్వం అన్ని ఇంటి దగ్గరకి తీసుకొచ్చి ఇస్తుంటే

    పంటలు పండించుకుంటూ, పనులు చేసుకుంటూ హాయిగా వున్నారు..ఖాళీబుర్రకి పని చెప్పి లే!నిపో!నివన్నీ అలోచించి పసుపుపతికి ప్రాణభిక్ష పెట్టారు…వాడు మీ ప్రాణాలని హరించేదాకా నిద్రపోడు.

    నేను ఎప్పటినుండో మొత్తుకుంటున్నాను…

    కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పేవాడిని నమ్మకండి అని…

    కనీసం తాగడానికి నీళ్లు దొరక్క అల్లాడే రోజులు ఎంతో దూరంలో లేవు…

    దేవుడు కరువు ఛాయలు స్పష్టంగా చూపిస్తున్నాడు.

  9. AP is getting huge packages like

    1. Amaravathi – 15K crores.

    2. BPCL project – 60K crores.

    3. Railways – 9150 crores

    4. Polavaram – 12350 Crores

    5. Industrial Corridors (2) – This will cost you around 25K crores if they support industries in Power, Water, and Land, Taxes.

    6. Airports – 4 New are going to commence

    7. Outer Ring Road for Amaravathi – 25K crores.

    8. Vijayawada-Hyderabad – 6 Lane Highway.

    9. Vijayawada – Vizag Highway extension on Cards.

    10. Aqua Culture Support and providing subsidy.

    11. The Poorvadaya package for all Eastern states like West Bengal, Bihar, Jharkhand, Odisha, and Andhra Pradesh will still benefit greatly from this scheme.

    12. Green Renewable Energy discussions are going on

    13. Backward Districts of 8 = 8*50=400 Crores each year.

    14. Many more are on the way. I will update this in a Thread. This is all “In 30 days. This is not just cbn Track Record. This is one of the all-time records” He will beat this track record showing progress in the development of state .

Comments are closed.