జేసీ బ్రదర్స్ కు టీటీడీ ఛైర్మన్ పదవి!

జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి నియామకాన్ని పూర్తి చేయగానే.. ఎప్పుడెప్పుడు ఆ పర్వం పూర్తవుతుందా? విమర్శలతో విరుచుకుపడదామా? అని వెయిట్ చేస్తున్నట్టుగా ప్రతిపక్షాల నాయకులందరూ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు.  Advertisement…

జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి నియామకాన్ని పూర్తి చేయగానే.. ఎప్పుడెప్పుడు ఆ పర్వం పూర్తవుతుందా? విమర్శలతో విరుచుకుపడదామా? అని వెయిట్ చేస్తున్నట్టుగా ప్రతిపక్షాల నాయకులందరూ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు. 

జగన్ నిర్ణయాన్ని విమర్శించడానికి అనువుగా.. వారికి పెనక శరత్ చంద్రారెడ్డి దొరికారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన నిందితుడు. బెయిలుపై బయటకు వచ్చారు. నేరగాళ్లకు బోర్డులో అవకాశం కల్పిస్తున్నారని విమర్శిస్తున్న వారందరూ కూడా ఒక్క శరత్ పేరు చెబుతున్నారు, ఇంకా మిగిలిన నేరగాళ్లను కూడా బోర్డునుంచి తొలగించాలని అంటున్నారు. మరొక్క పేరు ప్రస్తావించడంలేదు. విమర్శలు ఒక్కటే వారికి ప్రయారిటీ. తమ విమర్శ నిజమా కాదా కూడా చూసుకోవడం లేదు. 

కాగా.. ఈ సందర్భంలో చినబాబు నారాలోకేష్ నామినేటెడ్ పోస్టుల గురించి ఇటీవల తన పాదయాత్రలో భాగంగా చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తెలుగుదేశం కార్యకర్తల మీద జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా పోలీసు కేసులు పెట్టిస్తోందని ఆరోపణలు చేసిన నారా లోకేష్.. తమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నామినేటెడ్ పోస్టులకు, పార్టీ నాయకులపై ఉన్న పోలీసు కేసులనే ప్రాతిపదికగా పరిగణిస్తామని వెల్లడించారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వారికే కీలక నామినేటెడ్ పోస్టులు కట్టబెడతామని హామీ ఇచ్చారు. 

అసలు తండ్రీ కొడుకులు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, శాంతి భద్రతల విధ్వంసానికి ప్రయత్నిస్తున్నారని అనేక ఆరోపణలున్నయి. చిత్తూరు జిల్లాలో అంగళ్లు వద్ద తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులమీదికే దాడికి తెగబడి, వారిని గాయాల పాల్జేయడం అనేది కేవలం చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్ల మాత్రమే జరిగిందని ఆల్రెడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. తమ పార్టీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయి.. ప్రతి ఊరిలోనూ వైసీపీ వారిమీద దాడులకు తెగబడేలా చేయడానికి.. నారా లోకేష్ స్కెచ్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

కేసులకు భయపడకుండా రెచ్చిపోవడానికి, మరింతగా అల్లర్లు సృష్టించడానికి తమ పార్టీ వారిని ప్రేరేపించడమే లక్ష్యంగా నారా లోకేష్ ..నామినేటెడ్ పదవులను తాయిలాలుగా ప్రయోగించినట్టు స్పష్టంగానే అర్థమవుతోంది. అయితే ఈ సందర్భంగా ఆయన మరో సంగతి కూడా వెల్లడించారు. జేసీ ప్రభాకర రెడ్డి మీద ప్రస్తుతానికి 60 కేసులు ఉన్నాయని, ఈ కేసులను వందకు పెంచుకోవడానికి తాను ప్రయత్నస్తానని ప్రభాకరరెడ్డి పోలీసులకే సవాలు విసురుతున్నారని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. 

ప్రభాకరరెడ్డి కేసుల్లో సెంచరీ సాధిస్తే లోకేష్ మురిసిపోయేలా కనిపిస్తున్నారు. అన్ని ఎక్కువ కేసులు ఉన్నందుకు, అంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ వచ్చినందుకు ఆయనకు ఎంత గొప్ప నామినేటెడ్ పదవిని కేటాయిస్తారో గదా.. అని సెటైర్లు పేలుతున్నాయి. 

రాష్ట్రంలో టీటీడీ ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవిని మించిన పోస్టు లేదు కాబట్టి.. తెదేపా అధికారంలోకి రాగానే.. అత్యధిక కేసులు ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి టీటీడీ బోర్డుఛైర్మన్ పదవి ఇస్తారేమో అని జనం నవ్వుకుంటున్నారు.