ఎన్నికలు ముగిశాయి. చాలా చోట్ల ఏదో ఒక పార్టీ ఆల్ మోస్ట్ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కొన్ని చోట్ల మాత్రం పోటా పోటీగా వుంది. ఈ పోటా పోటీ చోట్లలో ఎవరు గెలిచినా వెయ్యి, పదిహేను వందల ఓట్లతోనే అన్న టాక్ వుంది.
ఇవి కాక కొన్ని ప్లేస్ లు వున్నాయి. ఇవి కూటమి ష్యూర్ షాట్ విన్ అనే లెక్కలు వున్నాయి. అలాంటి నియోజక వర్గాలు కూడా ఇప్పుడు టఫ్ ఫైట్ లోకి వచ్చాయి అనే టాక్ వుంది. ఈ నియోజక వర్గాల్లో కనుక వైకాపా గెలిస్తే గవర్నమెంట్ పక్కా అనే మాటలు వున్నాయి.
బొబ్బిలి సీటు కూటమిదే అని టాక్. గాజువాకలో వైకాపా అమర్ గెలిచే ప్రసక్తి లేదని ఓ అంచనా. కాకినాడ రూరల్ లో జనసేనదే విజయం అని మొదటి నుంచీ హడావుడి. ఇలాంటి చోట్ల కనుక వైకాపా గెలిచింది అనుకోండి.. ఇక ప్రభుత్వం వచ్చేసినట్లే.
అలాగే తేదేపా విషయంలోనూ ఇలాంటివి కొన్ని వున్నాయి. పలాస నుంచి వైకాపా గెలుపు ఈజీ అని ఓ టాక్. వైజాగ్ నార్త్ ఆల్ మోస్ట్ వైకాపా అని కామెంట్. తుని వైకాపా అని ఫిక్స్. ఇలాంటి చోట్ల కనుక కూటమి గెలిచింది అంటే ఇక ఆ గవర్నమెంట్ పక్కా అని మరో లెక్క.
ఉత్తరాంధ్ర జనాలు ఇప్పుడు ఇలాంటి నియోజకవర్గాల గురించే లెక్కలు కడుతున్నారు. కొన్నింటిని ముందే వదిలేసారు. అనకాపల్లిని కూటమికి ఆల్ మోస్ట్ వదిలేసినట్లు టాక్. చోడవరం కూడా కష్టం అని, మాడుగుల టఫ్ ఫైట్ అని వైకాపా వర్గాల బోగట్టా.
ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తరువాత ఇలాంటి నియోజక వర్గాల తీరు చూస్తే చాలు టోటల్ రిజల్ట్ ఎలా వుండబోతోందో ఓ ఐడియా వచ్చేస్తుంది. అందరి దృష్టి ముందుగా వుండేది ఈ నియోజకవర్గాల మీదే.