వారాహి కాదు కిరాయి

ప‌వ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే ప్యాకేజీ స్టార్ అంటే ఆయ‌న ఒప్పుకోడు. కాదంటే జ‌నం న‌మ్మ‌రు. రాజ‌కీయాల్లో కొంచెం ముదిరాకా గోడ‌మీద పిల్లిగా మారుతారు. చిరంజీవి కాంగ్రెస్‌లోకి జంప్ చేయ‌డానికి  కొంచెం టైమ్ తీసుకున్నాడు. ప‌వ‌న్…

ప‌వ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే ప్యాకేజీ స్టార్ అంటే ఆయ‌న ఒప్పుకోడు. కాదంటే జ‌నం న‌మ్మ‌రు. రాజ‌కీయాల్లో కొంచెం ముదిరాకా గోడ‌మీద పిల్లిగా మారుతారు. చిరంజీవి కాంగ్రెస్‌లోకి జంప్ చేయ‌డానికి  కొంచెం టైమ్ తీసుకున్నాడు. ప‌వ‌న్ అలా కాదు, ప్రారంభమే గోడ‌మీద పిల్లి.

రాజ‌కీయ పార్టీ ప్రారంభించిన ఎవ‌రైనా ఎన్నిక‌ల్లో పోటీ చేసి జాత‌కం చూసుకుంటారు. ప‌వ‌న్ జ‌న‌సేన‌ని హోల్‌సేల్‌గా చంద్ర‌బాబుకి అమ్మేసాడు. స‌రే, అమ్మ‌లేదు. జ‌నం కోసం, ప్ర‌జాప్ర‌యోజ‌నాల కోసం టీడీపీకి స‌పోర్ట్ చేసాడ‌నే అనుకుందాం. త‌రువాత ఐదేళ్లు జ‌నం ఎందుకు గుర్తుకు రాలేదు. చంద్ర‌బాబు పాల‌న రామ‌రాజ్యంలా క‌నిపించిందా? జ‌నం సుభిక్షంగా వున్నారా? కూల్‌గా సినిమాలు చేసి డ‌బ్బు సంపాదించుకుని, చివ‌ర్లో బిల్డ‌ప్ బాబాయిలా దిగాడు. జ‌గ‌న్ వేవ్‌కి అడ్డుక‌ట్ట వేయ‌డానికి, తెలుగుదేశంతో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్టు న‌టించి, నెగెటివ్ వోటుని చీల్చే ప్ర‌య‌త్నం చేసాడు. ఇక్క‌డ ప్యాకేజీ ప‌ని చేసిందా? ప్ర‌జాక్షేమం ప‌ని చేసిందా?

జ‌న‌సేన చిత్తుచిత్తుగా ఓడిపోయింది. గెలవ‌డానికి ఏ ప్ర‌య‌త్న‌మూ చేయ‌ని పార్టీ ఓడిపోవ‌డం స‌హ‌జం. ఈ ఐదేళ్లు ఏం చేసాడు? సినిమాలు చేసి డ‌బ్బులు సంపాదించుకున్నాడు. బీజేపీతో పొత్తు అన్నాడు. అదేం పొత్తో ఎవ‌రికీ తెలియ‌దు. ఆ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన ఏ స్థానిక ఎన్నిక‌ల్లో అయినా పోటీ చేసాడా అంటే అదీ లేదు. ప‌ల్లెల్లో ఎలాగూ బ‌లం లేదు. మ‌రి మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్‌ల‌లో అయినా పార్టీని పోటీ చేయించి వూరూరూ తిరిగాడా అంటే లేదు. మ‌రేం చేసాడు? సినిమాలు చేసుకున్నాడు. అభిమానులు ఈల‌లు వేస్తే పార్టీ బ‌తుకుతుందా?

అయినా స‌రే ప‌వ‌న్‌ని జ‌నం న‌మ్మాలి. ఆయ‌న జ‌నం కోసం పార్టీని పెట్టాడంటే న‌మ్మాలి, రేప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం పోటీ చేస్తే న‌మ్మి ఓట్లు వేయాలి. ప‌వ‌న్ వేరు, ప్ర‌జ‌లు వేరు. ఆయ‌నికి ప్ర‌జ‌ల‌కి ఏమీ సంబంధం లేదు. సినిమాల్లో డ‌బ్బు కోసం న‌టించిన‌ట్టే, రాజ‌కీయాల్లో కూడా న‌టిస్తున్నాడు. అక్క‌డ రంగులు పూసుకుంటాడు, ఇక్క‌డ పూసుకోడు. అదే తేడా. మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌.

వారాహి అని ఒక వాహ‌నం కొన్నాడు. 6 నెల‌లుగా షెడ్‌లో పెట్టుకున్నాడు. ఎందుకంటే అది వారాహి కాదు, కిరాయి. చంద్ర‌బాబు డ‌బ్బు క‌డితే క‌దులుతుంది. లోకేశ్ యాత్ర స‌గం అయిపోయింది కాబ‌ట్టి, ఇప్పుడు తాళాలు, తాయిలాలు అందాయి.

నేను నిప్పు క‌ణిక అని ప‌వ‌న్ రేపు ప్ర‌చారాల్లో భారీగా స్పీచ్‌లు ఇస్తాడు. జ‌నం చ‌ప్ప‌ట్లు కొడ‌తారు. అయితే ఈ నిప్పు ప‌దేళ్ల నుంచి ఏ బూడిద‌లో వుందో తెలియ‌దు. త‌న‌ని తాను నిప్పుగా భావిస్తున్న ప‌వ‌న్ ఒక మిణుగురు మాత్ర‌మే.

జ‌గ‌న్ అదృష్టం ఏమంటే ప‌వ‌న్ బాబు క‌లిసి ఈసారి పోటీ చేయాల‌ని అనుకోవ‌డం. ఈత‌రాని వాడు, వ‌చ్చిన వాన్ని ముంచేస్తాడు. ప‌వ‌న్‌కి ఈత రాదు, బాబుకి వ‌చ్చు. ఒక‌ర్ని ప‌ట్టుకుని ఇంకొక‌రు ఇద్ద‌రూ మునిగిపోతున్నారు. వారాహి చివ‌రికి వారంత‌పు సెల‌వ‌ల‌కి వుప‌యోగ ప‌డుతుంది.