ఏపీ రాజకీయాల్లో జనసేన, వైసీపీ మధ్య ఉప్పునిప్పులా వ్యవహారం నడుస్తోంది. పవన్‌కల్యాణ్, వైఎస్ జగన్ పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ హీరోగా తీసే సినిమాకు తాను ప్రొడ్యూసర్ చేస్తానని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆఫర్ చేయడం గమనార్హం. ఇది రియల్ ఆఫర్ అనుకుంటే పొరపాటే. పవన్‌ను వ్యంగ్యంగా దెప్పి పొడిచే క్రమంలో గుడివాడ అమర్నాథ్ తన మార్క్ పంచ్‌లు విసిరారు.
అనకాపల్లి జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పవన్‌పై సెటైర్స్ గుప్పించారు. పవన్‌కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కలలు కంటున్నారన్నారు. “సీఎం పవన్‌కల్యాణ్” టైటిల్‌తో సినిమా తీస్తే తాను నిర్మాతగా వ్యవహరిస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. రీల్ లైఫ్‌లో తప్ప రియల్ లైఫ్‌లో పవన్ హీరో కాలేరని ఆయన మాటల్లోని మర్మం. తెరపై పవన్‌ను హీరోగా చూసుకోవచ్చని గుడివాడ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గ పేర్లు కూడా పవన్‌కు తెలియదన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎం అవుతారా? అని ఆయన నిలదీయడం గమనార్హం. పవన్ సినిమాల్లో మాత్రమే పవర్‌స్టార్ అని, రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
2024 ఎన్నికల్లో టీడీపీకి మహాప్రస్థానం ఖాయమని జోస్యం చెప్పారు. అంటే టీడీపీ శ్మశాన వాటికకు చేరాల్సిన సమయం వచ్చిందని మంత్రి పరోక్షంగా విమర్శలు చేశారు.