కేంద్రంతో చెప్పి సీఎం వైఎస్ జగన్‌ను ఒక ఆట ఆడిస్తానని పవన్‌కల్యాణ్ అనడంపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. 12 సంవత్సరాలుగా ఏమీ లేని రోజుల్లోనే …నాడు భారతదేశమంతా సోనియాగాంధీని చూసి గడగడలాడుతున్నా, ఆమెని ఒక ఆట ఆడించిన నాయకుడు జగన్ అని ప్రశంసించారు. జగన్‌ను ఆడించే దమ్ము, ధైర్యం ఉన్న మగాడు ఇంకా ఈ రాష్ట్రంలో పుట్టలేదని అనిల్ అన్నారు.
జగన్‌ను ఆడిస్తామని వాళ్లేమైనా భ్రమపడుతున్నారేమో అని ఆయన దెప్పి పొడిచారు. చక్కటి చిరునవ్వుతో రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయిన నాయకుడు వైఎస్ జగన్ అని ఆయన కొనియాడారు. ఏదో ప్రశాంతంగా నవ్వుతున్నాడని, మౌనంగా ఉన్నాడని, ఏమీ చేయడని అనుకుంటున్నారేమో అని ఆయన చెప్పుకొచ్చారు. చాలా మందిని గడగడలాడించి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.
నువ్వు (పవన్‌కల్యాణ్), బాబు, పులికేశి (లోకేశ్) …ఇంకా ఎవరైనా కట్ట కట్టుకుని వచ్చినా వైఎస్ జగన్ వెంట్రుక కూడా టచ్ చేయలేరని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ధీమాగా చెప్పారు. కేంద్రంతో కాదు కదా, ఐక్యరాజ్య సమతి, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఏవైనా వుంటే కట్ట కట్టుకుని రావాలని పవన్‌కు అనిల్ సూచించారు. జగన్‌ను ఏమీ పీకలేరన్నారు. జగన్‌ను నడిరోడ్డులో నిలబెడతామన్నోళ్లంతా, చివరికి నడిరోడ్డులో నిలబడేది మీ బ్యాచే అని ఆయన చీవాట్లు పెట్టారు.
2024లో జగన్‌ను మళ్లీ సీఎం చేస్తారని, ఆయన్ను హెచ్చరించిన వాళ్లందరినీ హైదరాబాద్‌కు పంపుతారన్నారు. వారాహి యాత్రకు పెట్రోల్ దండుగ అని ఆయన వెటకరించారు. ఎటూ పవన్ సినిమాలు చేసుకుంటున్నారని, మళ్లీ అందులోనే సెటిల్ అవుతారన్నారు. పవన్‌ను నమ్ముకున్నోళ్లు మాత్రం సర్వనాశనం అవుతారని ఆయన అన్నారు.