బాబు కోసం రిచ్ పెయిడ్ సంస్థ ఆవిర్భావం

చంద్ర‌బాబుకు క‌ష్ట‌మొస్తే ఎవ‌రెవ‌రో ముందు కొస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా బాబును వెన‌కేసుకొస్తే పెద్ద‌గా బ‌లం వుండ‌ద‌నే భావ‌న‌తో కొంత మంది క‌లిసి సంస్థ‌గా ఏర్ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బాబు కోసం మాన‌వ హ‌క్కుల సంఘం ఒక‌టి చాలా…

చంద్ర‌బాబుకు క‌ష్ట‌మొస్తే ఎవ‌రెవ‌రో ముందు కొస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా బాబును వెన‌కేసుకొస్తే పెద్ద‌గా బ‌లం వుండ‌ద‌నే భావ‌న‌తో కొంత మంది క‌లిసి సంస్థ‌గా ఏర్ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బాబు కోసం మాన‌వ హ‌క్కుల సంఘం ఒక‌టి చాలా కాలం క్రిత‌మే పుట్టుకొచ్చింది. పేరుకేమో మానవ హ‌క్కులు, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్షణ‌, ఏపీ భవిష్య‌త్ త‌దిత‌ర ముద్దుముద్దు పేర్ల‌తో చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

తాజాగా ఏపీలో సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ పేరుతో ఒక సంస్థ చంద్ర‌బాబు కోసం, చంద్ర‌బాబు చేత పురుడు పోసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అవినీతి ఆరోప‌ణ‌ల‌పై చంద్ర‌బాబు అరెస్ట్ శోచ‌నీయ‌మ‌ని ఈ సంస్థ వాపోయింది.

‘ప్రతిపక్షనేతపై పూర్తి రుజువులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టక ముందే అరెస్ట్‌ చేయడం సరికాదు. ప్రభుత్వంలో కింది స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు అత్యుతన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రినే బాధ్యుడ్ని చేయడం హేతుబద్ధం కాదు. ప్రస్తుత అంశంలో ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఆధారాలు ప్రవేశపెట్టకుండానే, కేవలం అనుమానం ప్రాతిపదికన అరెస్టు వంటి తీవ్ర చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రతిపక్షనేత అరెస్టులో పారదర్శకత లోపించడం, సరైన విధి విధానాలు పాటించకపోవడం బాధాకరం’ అని ఆ సంస్థ పేర్కొంది.

ఈ సంస్థ అధ్య‌క్షుడిగా హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ భ‌వానీ ప్ర‌సాద్‌, ఉపాధ్య‌క్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.గోపాల‌రావు, కార్య‌ద‌ర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌, స‌భ్యుడిగా ఏపీ మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులున్నారు. వీరిలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌తో వైసీపీ ప్ర‌భుత్వ వివాదం గురించి అంద‌రికీ తెలిసిందే. అలాగే ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యాన్ని అర్ధంత‌రంగా చీఫ్ సెక్ర‌ట‌రీ నుంచి త‌ప్పించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై గుర్రుగా ఉన్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణలు చేస్తున్నారు.

చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డ‌మే ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించిన‌ట్టు అని వీరి భావ‌న‌. గ‌తంలో అయితే జ‌నం ఇలాంటి వాళ్ల మాట‌ల్ని విశ్వ‌సించేవారు. ఇప్పుడు ఎవ‌రి మాట‌ల వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో జ‌నానికి స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వుంది. తెలంగాణాలో జీవ‌నం సాగిస్తూ ఏపీలో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం ఉద్య‌మిస్తామ‌ని వీరు చెబుతున్న మాట‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు. సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ అనేది చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికి ఉద్భ‌వించిన రిచ్ పెయిడ్ సంస్థ అనే విమ‌ర్శ విన‌వ‌స్తోంది. 

ఏ సంస్థ అయినా దాని ప‌నితీరే న‌మ్మ‌కాన్ని పొందుతుంది. తాజాగా సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ అనేది పురుడు పోసుకోగానే చంద్ర‌బాబు కోసం ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డంతోనే అనుమానాల‌న్నీ అని అంటున్నారు.