శ్రీకాకుళం జిల్లాలో అత్యంత సీనియర్ ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు మాజీ మంత్రి అయిన గుండ అప్పల సూర్యనారాయణ సతీమణికి టీడీపీ అధినాయకత్వం హ్యాండ్ ఇచ్చింది. 2014లో ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచిన గుండ లక్ష్మీదేవికి ఈసారి టికెట్ ఇవ్వలేదు.
దాంతో గుండ అప్పల సూర్యనారాయణ అనుచరులు అభిమానులు అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. టీడీపీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరారు. అయితే అధినాయకత్వంతో ఒకసారి మాట్లాడిన మీదటనే నిర్ణయం తీసుకుందామని మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ వారిని సముదాయించారు.
టీడీపీ పెద్దల పిలుపుతో ఆయన వెళ్లి మాట్లాడారు. అక్కడ ఏ ప్రతిపాదన చేశారో తెలియదు కానీ త్వరలో సంచలన నిర్ణయం అని మాజీ మంత్రి అంటున్నారు. హై కమాండ్ కి పరిస్థితి మొత్తం చెప్పామని వారు కనుక పరిశీలించి న్యాయం చేస్తే సరే సరి. లేకపోతే తన నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
టికెట్ గుండ ఫ్యామిలీకి ఇవ్వాలన్నదే మాజీ మంత్రి డిమాండ్ గా ఉంది అంటున్నారు. ఎమ్మెల్సీ ఇస్తామనో నామినేటెడ్ పోస్ట్ ఇస్తామనో హామీలు ఇస్తే ఒప్పుకోమని ఆయన ముందే చెప్పారు. ఇప్పటికే అక్కడ టీడీపీ క్యాండిడేట్ ని ప్రకటించింది. మార్చి ఇవ్వడం అంటే అది ఆ సీటుకే పరిమితం కాదు,
అన్ని చోట్ల నుంచి డిమాండ్లు పుట్టుకుని వస్తాయి. అందువల్ల టికెట్ దక్కకపోవచ్చు అంటున్నారు. దాంతో మాజీ మంత్రి సంచలన నిర్ణయం దిశగానే అడుగులు వేస్తారు అని అంటున్నారు. మాజీ మంత్రి శ్రీకాకుళం ఎంపీగా ఆయన సతీమణి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే శ్రీకాకుళం టీడీపీకి అతి పెద్ద దెబ్బ పడుతుందని అంటున్నారు.