అరకు కాఫీ ఇపుడు అంతర్జాతీయమైంది. ఈ వేడి రుచులూరే పానీయం లేక ఉండలేని జనాలు గ్లోబ్ మొత్తం మీద ఉన్నారు. అరకు కాఫీ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మారింది. ఈ రోజున అనేక దేశాలకు అరకు కాఫీ ఎగుమతి కూడా అవుతోంది.
అరకు కాఫీకి ఉన్న గ్లామర్ గ్రామర్ కూడా ఎక్కువే. దానికి తోడు ఇపుడు దాని రేటు కూడా టాప్ రేపుతోంది. ఒక్క కప్పు కాఫీ అక్షరాలా ఎనిమిది వందల రూపాయలు అంటే షాకి తినాల్సిందే. అరకు కాఫీ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
మన అరకు కాఫీకి జపాన్ లో కప్పు రేటు ఏడు పౌండ్లుగా పెట్టి భలే బిజినెస్ చేసుకుంటున్నారు. మన దేశీయ కరెన్సీలో దాని విలువ ఎనిమిది వందలు అన్న మాట. ఈ విషయన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ రవిప్రకాష్ తెలియచేశారు.
దాంతో అరకు కాఫీ ఘుమఘుమలు అంతర్జాతీయంగా అదిరిపోయే రేంజికి చేరుకున్నాయని అరకు ఏజెన్సీలోని కాఫీ పండించే రైతాంగం మురిసిపోతోంది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు కూడా అరకు కాఫీ ఎగుమతులు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారంటే అరకు కాఫీతోనే అంతర్జాతీయ సమాజానికి రోజు ఆరంభం కావాలన్న మాటేగా.