నన్ను అవమానించారు అంటున్న అశోక్

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సింహాచలం అప్పన్న సాక్షిగా తన మనసులోని బాధను వెళ్లబోసుకున్నారు. తనను అయిదేళ్ళ పాటు అవమానించారు అని గత వైసీపీ ప్రభుత్వం మీద ఆయన…

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సింహాచలం అప్పన్న సాక్షిగా తన మనసులోని బాధను వెళ్లబోసుకున్నారు. తనను అయిదేళ్ళ పాటు అవమానించారు అని గత వైసీపీ ప్రభుత్వం మీద ఆయన మండిపడ్డారు. ఆనాడు ఎన్నో అవమానాలు తాను భరించాను అని ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకున్నారు.

వైసీపీని ప్రజలు ఓడించి ఇంటికి పంపించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన అంటున్నారు. గత ప్రభుత్వం తనను ఎన్నో సార్లు దూషించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను వేధించారు అని రాజు గారు అంటున్నారు.

అదే సమయంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ప్రసాద్ పధకం కింద సింహాచలానికి తెచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగడం లేదని అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. కొండ మీదకు నడిపేందుకు విద్యుత్ బస్సులను కూడా అమలు లోకి తేవడానికే ఏళ్ళు పట్టిందని అధికారుల తీరు మీద ఫైర్ అయ్యారు.

రాజు గారు అవమానం పడ్డానని మీడియా ముఖంగా చెప్పడం గమనార్హం. అయన ప్లేస్ లో అప్పట్లో ఆయన అన్న మొదటి భార్య కుమార్తెకు గత ప్రభుత్వం ట్రస్ట్ బాధ్యతలు అప్పగించింది. అలాగే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతల నుంచి కూడా ఆ రోజులలో అశోక్ ని పక్కన పెట్టేశారు. అవన్నీ తనకు అవమానానలు అని ఆయన అంటున్నారు.

అయితే రాజు గారికి అవే అవమానాలా లేక ఇంకా ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా అన్నది కూడా తర్కించుకుంటున్నారు. ఆయన రాజకీయ దిగ్గజంగా ఉన్నారు. అటువంటి నాయకుడి సేవలను ఇపుడు పార్టీ పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. ఆయనలో ఆ రకంగానూ అసంతృప్తి ఉందని ప్రచారం సాగుతోంది. ఆయనకు గవర్నర్ ఇస్తారని అన్నారు. రాజ్యసభ సీటు అన్నారు. ఆయనకు మంచి పదవులు దక్కాలని అభిమానులు అనుచరులు కోరుకుంటున్నారు.

రాజు గారు అయితే తనకు పదవుల మీద ఆశలు లేవు అనే అంటున్నారు. కానీ పూసపాటి వారి వంశ చరిత్ర వారికి విజయనగరం జిల్లాలో ఉన్న పట్టు అన్నీ చూసిన వారు ఎవరూ వారిని తెర మరుగు కావాలని అనుకోరు. వారు ఎప్పటికి అలాగే పదవులలో ఉండాలనే కోరుకుంటారు. అశోక్ విషయంలో అయితే వైసీపీ చేసిన అవమానాలు బాహాటంగానే ఉన్నాయి. ఆయనలో అన్ని రకాలైన ఆవేదన మాత్రం అంతర్గతంగా ఉందని అంటున్నారు.

9 Replies to “నన్ను అవమానించారు అంటున్న అశోక్”

  1. అప్పట్లో కేరళ మారు తండ్రి కూతురైన సంచి గారిని అడ్డం పెట్టుకొని, గ్రేట్ ఆంధ్ర రాజు గారి మీద ఎన్ని ఏకీసెక్కాలు రాసింది మరచి పోలేదు.

Comments are closed.