ఈ దె…భాష ఏంటి అయ్యన్నా…!?

ఆయన వయసు డెబ్బైకి చేరువ అవుతోంది. నలభైయేళ్ళ రాజకీయ జీవితం. ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గలిచి వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన అనుభవం ఉంది. కానీ నోరు విప్పితే మాత్రం అనుచితమైన వ్యాఖ్యలే చేస్తారు.…

ఆయన వయసు డెబ్బైకి చేరువ అవుతోంది. నలభైయేళ్ళ రాజకీయ జీవితం. ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గలిచి వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన అనుభవం ఉంది. కానీ నోరు విప్పితే మాత్రం అనుచితమైన వ్యాఖ్యలే చేస్తారు.

అది మరోసారి రుజువు చేసుకున్నారు ఈ సీనియర్ మోస్ట్ నేత. ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నంలోని నాతవరం మండలం ఏపీపురం గ్రామంలో సోమవారం అయ్యన్న టీడీపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నోటికి పని చెప్పారు. ఎప్పటిలాగానే జగన్ మీద లోకల్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మీద తన భాష వాడేశారు.

ఈ వైసీపీ ఎమ్మెల్యే గురించి చెప్పుకోవడం వేస్ట్. అయినా రెండు నెలలలో దె..స్తాడు అంటూ అయ్యన్న పచ్చి బూతునే వాడారు. అంతటితో ఆగకుండా సీఎం జగన్ మీద తన భాషా పాండిత్యం చూపారు. సర్పంచులకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తుంది. అలాగే ఏపీ పురం పంచాయతీకి కూడా ఆరు లక్షలు వచ్చాయి. కానీ వాటిని ఇవ్వకుండా జగన్ దె… సాడు అంటూ మరో బూతు వాడేశారు.

చిత్రమేంటి అంటే అయ్యన్న తన భాష అలా వాడేస్తూంటే తమ్ముళ్ళు ఈలలు గోలలతో హడావుడి చేయడం. దాంతో అయ్యన్న తన స్పీచ్ అదుర్స్ అనుకుని అలా మాట్లాడేశారు. అయ్యన్న పెద్ద మనిషి. ఆయన ప్రతిపక్ష నేత. అధికార పార్టీని విమర్శించవచ్చు. అంతే కాదు ప్రత్యర్ధిగా ఉన్న ఎమ్మెల్యే మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేయవచ్చు. కానీ భాష ముఖ్యం కదా అన్నది అంతా అంటున్న మాట.

ఆయన లాంటి సీనియర్ సిటిజన్. మంత్రిగా పనిచేసిన వారే అలాంటి భాష వాడుతూంటే ఇక ఈ తరం ఏమి నేర్చుకుంటారు ఎలా మాట్లాడుతారు అన్నదే కదా అందరి బాధ. అయినా నవ్వి పోదురు గాక నాకేమి అన్న చందంగా పెద్దాయన వ్యవహరిస్తే నగుబాటు వినేవారికే తప్ప ఆయనకు కాదని సెటైర్లు పేలుతున్నాయి.