ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీలో కొనసాగరనే ఊహాగానాలు చెలరేగాయి. మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఆయన జగన్‌పై అసంతృప్తిగా ఉన్నారు.
తన జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్‌ను మాత్రం కొనసాగించి, తనను తప్పించడంపై బాలినేని, ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారనేది వాస్తవం. గతంలో జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని, కనీసం ఆ సంగతి కూడా గుర్తు పెట్టుకోకుండా తప్పించారని సన్నిహితుల వద్ద బాలినేని వాపోతున్నారు.
తాజాగా బాలినేని వైసీపీలో కొనసాగరనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనిపై బాలినేని సీరియస్‌గా స్పందించారు. తనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ వైసీపీలోనే కొనసాగుతానన్నారు. తనపై సాగుతున్న అసత్య ప్రచారాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అయితే నిప్పులేనిదే పొగరాదనే సామెత చందాన, బాలినేని అసంతృప్తిగా ఉండడం వల్లే ఆయనపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని పలువురు అంటున్నారు. ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించడాన్ని ఇప్పటికీ ఆయన జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే వైసీపీ అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారని బాలినేని అనుచరులు చెబుతున్నారు.
ఇటీవల జనసేనాని పవన్‌కల్యాణ్ చేనేత సవాల్‌ని బాలినేనికి విసిరిన సంగతి తెలిసిందే. దాన్ని పాజిటివ్‌గా తీసుకుని బాలినేని చేనేత వస్త్రాలను ధరించడం ఆయనపై పార్టీ మార్పు ప్రచారానికి కారణమైందన్న వాదన కూడా లేకపోలేదు.
జగన్‌కు వరుసకు మామ అయ్యే బాలినేని లాంటి నేతలపై కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుందే, అసలు వైసీపీలో ఏం జరుగుతోందనే ప్రశ్నలొస్తున్నాయి.