శ్రీకాకుళం జిల్లాకు ఒక మేజర్ పోర్ట్ నిర్మించాలన్నది దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్. అది జనం తీరని కోరిక. గత తెలుగుదేశం ప్రభుత్వం పోర్ట్ విషయంలో మాటల వరకే పరిమితం అయింది. అయిదేళ్ళ పాటు రాజ్యం చేస్దిన టీడీపీ పెద్దలు పోర్టు విషయంలో ఎంతసేపూ ప్రచారమే చేసుకున్నారు తప్ప చేతలలో పెద్దగా ప్రగతి లేదు
వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫలితంగా భావనపాడు వద్ద మేజర్ పొర్టుకు రంగం సిద్ధం అయింది. ఈ పోర్టు కోసం భూ సేకరణ సైతం మంచి ప్యాకేజి ఇచ్చి పూర్తి చేయించారు.
ఈ పోర్టుకు ఈ నెల 19న శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారు. భావనపాడుతో శ్రీకాకుళానికి మహా భాగ్యం పట్టనుంది. శ్రీకాకుళం దశ తిరగడమే కాకుండా రానున్న కాలంలో పారిశ్రామికంగా కూడా ఈ జిల్లా ముందుకు సాగేందుకు మార్గం సుగమం అవుతుంది.
భావనపాడు అన్నది దశాబ్దాలుగా వినిపిస్తున్న మాటను ఒక కలను నిజం చేస్తున్న జగన్ కి జిల్లా ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇటీవలే విశాఖలో ఉత్తరాంధ్రా టీడీపీ ప్రాంతీయ సదస్సు నిర్వహించి ఈ ప్రాంతానికి వైసీపీ ఏమి చేసింది అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇపుడు భావనపాడు పోర్టు దానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు.
ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు మల్టీ స్పెషల్ ఆసుపత్రి నిర్మాణం కూడా వైసీపీ హయాంలోనే జరిగింది అని గుర్తు చేస్తున్నారు. తొందరలోనే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. విశాఖను టూరిజం ఐటీ సెక్టర్ పరంగా అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి.
ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎక్కువగా ఉత్తరాంధ్రాకే పరిశ్రమలు రానున్నాయి. వీటిని చూపిస్తూ ఉత్తరాంధ్రకు జగన్ చేతలలో ప్రగతి చూపిస్తున్నరని వైసీపీ నేతలు చెబుతున్నారు.