చంద్రబాబు.. పవన్ కి అగ్ని పరీక్ష!

విశాఖ ఉక్కుని కాపాడుకోవాలన్న డిమాండ్ తో విశాఖలో కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకో విజయవంతం అయింది. ఒక దశలో ఉద్రిక్తంగా సాగింది. విశాఖ ఉక్కుని ఏమి చేయాలనుకుంటున్నారు అని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ఉక్కు…

విశాఖ ఉక్కుని కాపాడుకోవాలన్న డిమాండ్ తో విశాఖలో కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకో విజయవంతం అయింది. ఒక దశలో ఉద్రిక్తంగా సాగింది. విశాఖ ఉక్కుని ఏమి చేయాలనుకుంటున్నారు అని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ఉక్కు కార్మిక సంఘాల నేతలు ప్రశ్నించారు.

విశాఖ ఉక్కుని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లదే అని స్పష్టం చేస్తున్నారు. ఏపీలోని ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయిందని అటువంటిది ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుని కాపాడలేరా అని కార్మిక సంఘాల నాయకులు నిలదీస్తున్నారు.

విశాఖ ఉక్కుని రోడ్డు మీద పడవేయకుండా చూడాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీను చంద్రబాబు పవన్ పురంధేశ్వరి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని ఆ విధంగా ఒక స్పష్టమైన ప్రకటన వెలువడాలని వారు కోరారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించాలంటే వర్కింగ్ క్యాపిటల్ కింద పది వేల కోట్ల రూపాయలను తక్షణం కేటాయించాలని కోరారు. విశాఖ పనితీరు మెరుగు పడేలా వెంటనే అయిదు వేల మంది ఉద్యోగులను నియమించాలని అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి యాక్షన్ ప్లాన్ ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం పెట్టుబడిగా పెట్టింది కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే స్టీల్ ప్లాంట్ పన్నుల ద్వారా కేంద్రానికి ఇచ్చింది యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అని గుర్తు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ ఈ విషయంలో చొరవ చూపాలని కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారింది. ప్లాంట్ ని కాపాడాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కేంద్రం వైఖరిలో మార్పు లేదు అని అంటున్నారు. దాంతో చంద్రబాబు పవన్ ఏమి చేస్తారు అనేది కార్మిక సంఘాల నుంచి వస్తున్న ప్రశ్న.

20 Replies to “చంద్రబాబు.. పవన్ కి అగ్ని పరీక్ష!”

  1. విజయవాడ లో 4 లక్షల మందికి వరద ముంపు గురైతేనే బాబు ఫొటోలకోసం బోట్ రైడ్ బిల్డప్ ఇచ్చాడు. అంతేకాని వాళ్ళని కనీసం ఆదుకోలేదు. ముందస్తు హెచ్చరిక చేసే వ్యవస్థ వున్నా వాడుకోలేని దద్దమ్మ అయిపోయాడు…

    ఉగ్గబట్టి వుండు ఉత్తరాంధ్ర అధిక తీరం వున్న మీకు బాబు తూఫాన్ రూపంలో వస్తాడు. పచ్చ సాని పత్రికల బిల్డప్ తప్పించి మిమ్మల్ని ఆదుకునే వాడు ఉండడు. బిల్డప్ మాత్రం పెపంచ స్థాయిలో ఉంటుంది. మీ కర్మ కి మీరే బాద్యులు.

    1. నీలాంటి సన్నాసులు ఇంకా బ్రతికే ఉన్నారు కదా? ఇంకెందుకు ముందస్తు హెచ్చరిక? సీబీఎన్ ఏమీ చెయ్యనట్టు.

Comments are closed.