తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పుష్కలంగా ఉందని, రేపు ఎన్నికలు పెట్టినా విజయం తమదే అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తరచూ చెబుతున్నారు ఏపీలో గాలి మారిందని తమదే అధికారం అని చంద్రబాబు సహా కీలక నేతలు అంటూంటారు.
ఇదంతా నిజమే అనుకున్నా వైసీపీ నుంచి వచ్చే లాజికల్ క్వశ్చన్స్ కి టీడీపీ నుంచి ఆన్సర్ మాత్రం దొరకదు అంటున్నారు. మీకు అంత ధీమా ఉంటే 175 కి 175 సీట్లు వస్తాయనుకుంటే ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు అన్నది వైసీపీ వాదన. దానికి బదులు అయితే టీడీపీ వద్ద లేదని అంటున్నారు.
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ టీడీపీ మీద ఇండైరెక్ట్ గా షాకింగ్ కామెంట్స్ చేసారు. పొత్తులు పెట్టుకుంటున్నారు అంటే ఆయా పార్టీలకు ప్రజాదరణ లేదని అర్థం అని ఆయన కొత్త మాట చెప్పారు. పొత్తుల కోసం కలవరించే వారు అంతా ప్రజా బలము లేని వారే అని ఆయన డిసైడ్ చేశారు. తమ పార్టీకి పాజిటివ్ ఓటు ఉందని, తాము చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని అంటున్నారు. తాము ప్రజలను నమ్ముకున్నామని, అందుకే పొత్తులు అన్నవి తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
బొత్స మాటలను బట్టి చూస్తే పొత్తుల కోసం వెంపర్లాడుతున్న పార్టీలకు ఓటమి భయం ఉందని, గెలిచే సీన్ లేదనే అంటున్నారు. టీడీపీకి ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతోనే పొత్తుల వైపు చూస్తోంది అని వైసీపీ నేతలు అంటున్నారు. పొత్తులు కూడా గెలుపు ఆశను ఇవ్వలేవని వైసీపీ మంత్రులు నేతలు చేస్తున్న తాజా ప్రకటనల సారాంశంగా ఉంది.