బొత్స వర్సెస్ సీఎం రమేష్

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరమైన ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో సీనియర్ నేత మాజీ మంత్రి ఒక విధంగా రాజకీయ కురు వృద్ధుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ మంచి ఎంపికగానే చేసి…

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరమైన ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో సీనియర్ నేత మాజీ మంత్రి ఒక విధంగా రాజకీయ కురు వృద్ధుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ మంచి ఎంపికగానే చేసి బరిలోకి వదిలింది. స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజ్ లో కూడా భారీ ఆధిక్యతతో వైసీపీ ఉంది.

రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన బొత్సను ఢీ కొట్టడం టీడీపీ కూటమికి కష్టమని అంతా అనుకుంటున్న క్రమంలో సీఎం రమేష్ కూటమి వైపు నుంచి ఎదురు నిలిచారు. ఆయన కూటమి తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్నారు.

క్యాంప్ రాజకీయాలతో పాటు అంగబలం అర్ధ బలంతో ఏమైనా ఎత్తులు వేస్తేనే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరికీ సులువు కాదు అన్న ప్రచారం నేపధ్యంలో సీఎం రమేష్ ఇపుడు కీలకంగా మారుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగారు. అయిదేళ్ళ నుంచే కమలం పార్టీ నేత అయ్యారు.

అయినా ఆయన మూలాలు అన్నీ టీడీపీలోనే ఉన్నాయి. అందుకే ఆయన అనకాపల్లి ఎంపీగా కూడా టీడీపీ నేతల మద్దతు కూడగట్టుకుని ఘన విజయం సాధించారు. చంద్రబాబు కూడా రమేష్ కే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిని గెలిపించే బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా సీఎం రమేష్ తోనే బొత్స తలపడాల్సి ఉంటుంది అని అంటున్నారు. బొత్స వ్యూహాలకు సీఎం రమేష్ ప్రతి వ్యూహాలకు మధ్యనే ఈ పోటీ అని అంటున్నారు.

ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా సాగే ఈ ఉప ఎన్నికలో ఫలితం చివరికి ఎవరికి అనుకూలం అంటే ఇపుడు చెప్పడం కష్టమే అని అంటున్నారు. అయిదేళ్ల అధికారం టీడీపీ కూటమి చేతిలో ఉండడం అటు వైపు ప్లస్ పాయింట్ అయితే అత్యధిక మెజారిటీ ఉండడం వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే మెజారిటీలు అధికారం ముందు వీగిపోవడమే సిసలైన రాజకీయం కాబట్టే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎవరిని గెలిపిస్తుంది అన్నది ఉత్కంఠభరితంగా మారిందిపుడు.

10 Replies to “బొత్స వర్సెస్ సీఎం రమేష్”

      1. మోడీ మీద మోజు అంత త్వరగా తీరిపోతుందా? భక్తులకు అంత త్వరగా తనివి తీరదు, మనసు నిండదు.

  1. బొత్స గారు జనసేన లోనికి వెళ్లి పోవటమే ఆయనకు మంచిది జనసేనకు మంచిది వైసీపీ ని ఇంకా అది రాజకీయ పార్టీ లాగా డెమోక్రసీ నోర్మ్స్ ఉంటాయి అనుకోటం మూర్కత్వమే జగన్ గారు ఎంగిలి వేసినట్టు కొంత డబ్బు పంచి మిగిలినది తినేసి దర్జాను అనుభవించడమే అయన లక్ష్యం కనీసం రోడ్స్ తీరు పోలవరాన్ని పడకేయించటం చూసిన తర్వాత ఆయనకు రాష్ట్రాభివృద్ధి మీద ఎంత శ్రద్ద ఉందొ అర్దమైనాక ఎవరు వేస్తారు అయన కొచ్చిన ఓట్లు అవి కాంగ్రెస్ ఓట్లు వాళ్ళు టీడీపీ కి బీజేపీ కి వెయ్యరు ఆ ఓటర్లు వీళ్లకు ప్రత్యర్థులకు మాత్రమే వేస్తారు అంతే తప్ప వైసీపీ మీద ప్రేమతో వేసినవి కావు రేపు కాంగ్రెస్ బలపడితే తక్షణం కాంగ్రెస్ కి వెళ్ళిపోతారు

Comments are closed.