ఎట్టకేలకు చంద్రబాబు కోరిక తీరింది. ఆయన పేరు ట్విట్టర్ లో మారుమోగుతోంది. కొన్ని గంటల పాటు ఆయన ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యారు. దానికి కారణం స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే #ScamstersterChandrababu అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది.
చంద్రబాబు అరెస్ట్ ను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావించడంతో.. దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు చంద్రబాబు వైరల్ అయ్యారు. వందల కోట్ల స్కామ్ లో చంద్రబాబు సూత్రధారి అంటూ వచ్చిన హెడ్ లైన్స్ తో ఆయన పేరు ట్విట్టర్ (X)లో మారుమోగిపోయింది.
ఇప్పుడు బ్రీఫ్ చేయి బాబూ.. గతంలో ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారు చంద్రబాబు. స్వయంగా ఓ ఎమ్మెల్సీతో ఫోన్ లో చంద్రబాబు మాట్లాడిన సంభాషణ వైరల్ అయింది. అందులో ఆయన వాడిన బ్రీఫ్డ్ మీ అనే పదం, అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇప్పటికీ ఆ పదం పొలిటికల్ వర్గాల్లో ఫేమస్. మళ్లీ ఇన్నేళ్లకు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ తో ఈ పదం మరోసారి తెరపైకొచ్చింది.
సీఐడీ అధికారులకు చంద్రబాబు బ్రీఫ్ చేశారంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. తన ఇంగ్లిష్ పరిజ్ఞానంతో చంద్రబాబు సీఐడీ అధికారులకు వినోదం అందిస్తున్నారని, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా బ్రీఫ్డ్ మీ అంటూ సమాధానానిలున్నారంటూ తెగ పోస్టులు పడుతున్నాయి.