చంద్రబాబు సరికొత్త ధోకా.. బీసీ మహిళకు ఎమ్మెల్సీ!

చంద్రబాబునాయుడు ప్రజలనే కాదు.. పార్టీ నాయకులను కూడా మోసం చేసే సుదీర్ఘ ప్రయత్నాలలో సరికొత్త ఎత్తు ఇది. బీసీ మహిళను ఎమ్మెల్సీ చేయబోతున్నాం అనే ముసుగు కింద.. పార్టీకి అంతో ఇంతో మీడియా సమావేశాల్లో…

చంద్రబాబునాయుడు ప్రజలనే కాదు.. పార్టీ నాయకులను కూడా మోసం చేసే సుదీర్ఘ ప్రయత్నాలలో సరికొత్త ఎత్తు ఇది. బీసీ మహిళను ఎమ్మెల్సీ చేయబోతున్నాం అనే ముసుగు కింద.. పార్టీకి అంతో ఇంతో మీడియా సమావేశాల్లో ఉపయోగపడుతూ ఉండే పంచుమర్తి అనురాధను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయించారు చంద్రబాబు. శాసనసభలో తమ పార్టీకి ఉండే ఎమ్మెల్యేల బలం ఏమాత్రం చాలదని స్పష్టంగా తెలిసినప్పటికీ.. ఆమెతో నామినేషన్ వేయించడమే అతి పెద్ద ధోకా అని పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నిజానికి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే 23 ఓట్లు అవసరం అవుతాయి. చెప్పుకోడానికి 2019లో తెలుగుదేశం తరఫున 23 మంది గెలిచారు. వారిలో నలుగురు పార్టీకి రాజీనామా చేసి.. ప్రస్తుతం వైసీపీకి దగ్గరగా మెలగుతున్నారు. విప్ జారీ చేసి వారి మీద ఒత్తిడి పెట్టాలని చూసినా సరే.. తమ ఓట్లు చెల్లుబాటు కాకుండా ఉండేలా వారు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకు ఓటు వేస్తారనే ఆశలు కూడా చంద్రబాబుకు ఉన్నాయి. అలా వేసినా కూడా.. వారి ఎమ్మెల్యేల సంఖ్యాబలం 21వరకు వచ్చి ఆగిపోతుంది.  

ఇంకా రెండు సీట్లు తక్కువ పడతాయి. పవన్ కల్యాణ్ ను కూడా విప్ జారీ చేయాల్సిందిగా కోరి రాపాక వరప్రసాద్ ఓటు కూడా వేయించుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు ఉంది. ఒకవేళ పవన్ విప్ జారీ చేసినా రాపాక వరప్రసాద్ దానిని ఖాతరు చేస్తారనే నమ్మకం లేదు. ఆ నేపథ్యంలో. . అనవసరంగా చంద్రబాబు స్కెచ్ కోసం పవన్ కల్యాణ్ తన పరువు పోగొట్టుకుని విప్ జారీచేస్తారో లేదోచూడాలి.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే.. తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం తక్కువ. కనుకనే బీసీ మహిళ అనే ట్యాగ్ లైన్ తో పంచుమర్తి అనురాధను రంగంలోకి దించినట్టు సమాచారం. గతంలో కూడా రాజ్యసభ ఎంపీ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే పరిస్థితి లేనప్పుడు .. ఎస్సీలకు టికెట్ ఇస్తున్నాం అనే మిషతో మోసపూరితంగా వర్ల రామయ్యను బరిలోకి దింపి ఆయన పరువు తీసిన ఘన చరిత్ర చంద్రబాబునాయుడుకు ఉంది. 

సీటు ఖచ్చితంగా గెలిచే సందర్భాల్లో దాన్ని అమ్ముకుంటారని, ఓడిపోయేప్పుడు మాత్రం ఇలా ఉదారంగా వెనుకబడిన వర్గాలను ప్రోత్సహిస్తారని పార్టీ వాళ్లే ఎద్దేవా చేస్తున్నారు.