వైఎస్ జగన్‌పై రాజకీయ విమర్శలు చేయాలంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు తప్ప, మరొకటి కనిపించదా? అపచారం అంటే అబద్ధాలు చెప్పడం, అవినీతికి పాల్పడడం, అసత్యాలను ప్రచారం చేయడం కూడా. ఈ చిన్న విషయాన్ని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ ఎలా విస్మరించారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి పారదర్శకత లేదని, రిసిప్టులు ఇవ్వడం లేదని ఇటీవల పవన్‌కల్యాణ్ విమర్శించి అభాసుపాలయ్యారు. పవన్‌కల్యాణ్ లక్షణం ఏంటంటే ఎవరైనా ఏదైనా చెబితే, అందులోని నిజానిజాలను పట్టించుకోరు. దాన్నే బయటికి చెప్పి, తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటారు. తిరుమల కొండ గురించి బాగా తెలిసిన చంద్రబాబునాయుడు కూడా పవన్ బాటలోనే పయనించడం విమర్శలకు తావిస్తోంది.
తిరుమల శ్రీవాణి ట్రస్టు నిర్వహణతో వెంకన్నకు అపచారం తలపెడుతున్నారని విమర్శలు చేశారు. శ్రీవాణి ట్రస్టు నిర్వహించేది ఎవరని ఆయన ప్రశ్నించారు. శ్రీవాణి టిక్కెట్లకు రిసిప్టులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రిసిప్టులు లేకుండా తీసుకుంటున్న డబ్బులు ఏమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. వెంకన్నకు అపచారం చేస్తే పుట్టగతులు ఉండవని చంద్రబాబు ఘాటు హెచ్చరిక చేశారు. వెంకన్న జోలికి వస్తే వచ్చే జన్మలో కాదు.. ఈ జన్మలోనే శిక్ష పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బాబు చెప్పేది బాగానే వుంది. అయితే శ్రీవాణి ట్రస్ట్ గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన బాధ్యత ఆయనపై లేదా? అనే ప్రశ్న తలెత్తింది.
శ్రీవాణి ట్రస్ట్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రొటోకాల్ దర్శనం చేసుకోవాలని కోరుకునే భక్తుల కోరికల్ని తీర్చేందుకు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఒక్కో టికెట్‌ను రూ.10,500 చొప్పున విక్రయిస్తారు. రోజుకు వెయ్యి టికెట్లను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. ఇందులో రూ.500 దర్శన టికెట్‌కు పోనూ, మిగిలిన రూ.10 వేలు శ్రీవాణి ట్రస్ట్‌కు చేరుతుంది. ఈ నిధులను దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాల పునరుద్ధరణకు వినియోగిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో కాకుండా తిరుపతి విమానాశ్రయంలో, అలాగే తిరుమలలో ఈ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇక రిసిప్టులు ఇవ్వకపోవడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. శ్రీవాణి ట్రస్ట్‌పై అపచార మాటలు మాట్లాడితే… పుట్టగతులుండవనే హెచ్చరికను అవాకులు చెవాకులు పేలుతున్న నాయకులు తమకు వర్తిస్తాయని గ్రహిస్తే మంచిది.