ఉత్తరాంధ్ర మొత్తం జనాభాలో ఒక్క పర్సెంట్ కూడా లేని తన సామాజిక వర్గం ఉత్తరాంధ్ర మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు సేవ్ ఉత్తరాంధ్ర కనపడలేదు. మొత్తం ఆస్తులు ఆక్రమించుకున్నప్పుడు సేవ్ ఉత్తరాంధ్ర కనపడలేదు. కానీ కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖను ప్రకటించినప్పటి నుండి చంద్రబాబు మరియు తన అనుకూల మీడియా నానా హడావుడి చేస్తోంది. ఒకసారి విశాఖ మునిగిపోతుందని, ఇంకో సారి విశాఖలో మొత్తం రాయలసీమ వారే ఆక్రమించుకుంటున్నారు అని అంటూ రాగాలు పలుకుతారు.
గతంలో తాడిపత్రి మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని సర్వం దోచుకున్న జేసీ బ్రదర్స్ ఎన్నికల ముందు సేవ్ తాడిపత్రి నినాదం అన్నట్లు ఇప్పుడు కొత్తగా చంద్రబాబు సేవ్ ఉత్తరాంధ్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారు. కేవలం తన కలల అమరావతి ఒక్కటే బాగుండాలని అనుకుంటున్న చంద్రబాబు అన్ని ప్రాంతాల మీద విషం కక్కుతున్నట్లు కనపడుతొందంటున్నారు వైసీపీ నేతలు. అయినా గతంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని అసెంబ్లీలో మాట్లాడుతూ మొత్తం ఉత్తరాంధ్రలో మెజారిటీ వాటాలో ఆస్తులు, హాస్పిటల్స్, హోటల్స్, అన్ని రకాల వ్యాపారాలు కూడా మా సామాజిక వర్గానివే ఉన్నాయని విశాఖలో రాజధాని ఏర్పడితే మొదటిగా బాగుపడేది మా సామాజిక వర్గంమనే చెప్పారు కాదా.. అది నిజం కాదా.
ఇప్పుడు ఏదో భూ ఆక్రమణలు జరుగుతున్నయంటున్నా టిడిపి నేతలు.. గత టిడిపి ప్రభుత్వం హయంలో భూ ఆక్రమణలు జరిగాయి అనే కదా సిట్ ఏర్పాటు చేసింది. కానీ ఆ సిట్ ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఆ సిట్ మొత్తం బయట పెడితే విశాఖలో భూ దందా చేసింది ఎవరో బయటపడతారు. ఆ 'భూ' ఆక్రమలో మోజారిటి వాటా టిడిపిలో చంద్రబాబు సామాజిక వర్గ నేతలే ఉంటారు అనేది నగ్న సత్యం. పదే పదే రాయలసీమ వారిని ముందుకు పెడుతు ఏదో జరిగిపోతుతోందనే అనే భ్రమ కల్పిస్తూ రాజకీయం చేయడం చంద్రబాబుకు తగదు. సీఎం రాయలసీమ వారు అయినంత మాత్రాన రాయలసీమ వారు అందరూ ఉత్తరాంధ్రకు వస్తారనుకోవడం భ్రమ.
చంద్రబాబు వారి అనుకూల మీడియా ఇప్పటికైనా మారి ఉత్తరాంధ్రకు ఎవరూ ఎటువంటి ద్రోహం చేశారు, ఎవరు అభివృద్ధి చేశారు అనేది చర్చ పెటితే మంచిదేమో. పదేపదే తన మీడియాలో నోటికి వచ్చింది రాసుకుంటూ రాయలసీమ వాళ్ళు దోచుకుంటున్నారు సేవ్ ఉత్తరాంధ్ర అనుకుంటూ ఉంటే చంద్రబాబును చరిత్ర ఎప్పటికీ క్షమించదు. హైదరాబాద్ లో చేసిన తప్పులకు ఇప్పటికే మిగతా ప్రాంతం వారు ఎంత నష్టపోయారో అందరికీ తెలుసు. మూడు ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తే చంద్రబాబుతో పాటు టిడిపికి కూడా మంచిది.