చంద్రబాబుకు కొత్త తలనొప్పి: నేతల్లో ఆ రెండూ లేవే!

చంద్రబాబునాయుడు పొత్తు ధర్మాన్ని చాలా బాగా పాటిస్తున్నారు. జనసేన సీట్లను కూడా కలుపుకుని.. ఏకంగా ఒకే విడతలో 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశాం అని గప్పాలు కొట్టుకుంటున్నారు. ఆ మాట నిజమే కావొచ్చు. Advertisement…

చంద్రబాబునాయుడు పొత్తు ధర్మాన్ని చాలా బాగా పాటిస్తున్నారు. జనసేన సీట్లను కూడా కలుపుకుని.. ఏకంగా ఒకే విడతలో 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశాం అని గప్పాలు కొట్టుకుంటున్నారు. ఆ మాట నిజమే కావొచ్చు.

కానీ ఆ 99లో ఎన్ని చోట్ల సొంత పార్టీలో అసంతృప్తులు, జనసేన నుంచి సహాయ నిరాకరణలు తలెత్తుతున్నాయి? ప్రకటించకుండా వదిలేసిన స్థానాల్లో నాయకులనుంచి ఎలాంటి ధిక్కారస్వరం వినిపిస్తోంది? పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్న వారు, ఆత్మాహుతి యత్నాలతో బెదిరించాలని చూస్తున్నవారు.. వీరందరినీ బుజ్జగించడం అసలు సాధ్యమేనా? ఇదంతా కూడా చంద్రబాబునాయుడుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. పార్టీలో ధిక్కారాన్ని, తిరుగుబాట్లను ఆయన సద్దుమణిగేలా చేయడానికి విఫలయత్నం చేస్తున్నారు.

సాధారణంగా ఒక పార్టీలో కొందరు నాయకులు అసంతృప్తి ఉన్నదంటే.. అది తొలగిపోడానికి ప్రధానంగా రెండు అంశాలు ఉండాలి. ఒకటి- పార్టీ అధినేత అపారమైన గౌరవం, నమ్మకం ఉండాలి. ఆయన ఏం చెప్పినా సరే దానిని శాసనంగా పాటించేంతటి విధేయత ఉండాలి. రెండు- ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉండాలి. అసంతృప్తితో రగులుతున్నా సరే.. తాము అధికార పార్టీ సభ్యులుగా రేపు చెలామణీ కాగలమనే భరోసా ఉండాలి. ఈ రెండు అంశాలలో ఏదో ఒకటి ఉన్నట్లయితే ఏ పార్టీలోనూ తిరుగుబాటు అనేది, ధిక్కారం అనేది వినిపించదు.

కానీ చంద్రబాబునాయుడు ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నారంటే.. ఆయన పార్టీలో నేతలకు ఆ రెండు లక్షణాలూ లేవు. చంద్రబాబు నాయకత్వం మీద గౌరవం ఎవ్వరిలోనూ లేదు. ఆయన పార్టీ అధినేతగా చెలామణీ అవుతున్నప్పటికీ.. మూలాల్లో ఉన్నది కుట్రే అనే సంగతి అందరికీ తెలుసు. అందుకే ఆయన మీద గౌరవం లేదు.

అలాగే, ఏ ఒక్క ఎన్నికలోనూ పార్టీని ఒంటరిగా విజయ తీరాలకు చేర్చలేని ఆయన అసమర్థత తెలిసిన వారు గనుక, ఆయనపై నమ్మకం కూడా లేదు. అదే సమయంలో పార్టీ ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందనే భరోసా కూడా పార్టీ నాయకుల్లో లేదు. ఏదో మీడియా ఎదుట, జనం ఎదుట మాట్లాడేప్పుడు.. జగన్ పని అయిపోయినట్లే అని ప్రల్లదనంగా పలుకుతుంటారు తప్ప.. ప్రెవేటు సంభాషణల్లో పరిస్థితి తమకు అంత సానుకూలంగా ఏమీ లేదని, అదృష్టం కలిసివస్తే తప్ప అధికారంలోకి రాలేం అని చెప్పుకుంటూ ఉన్నారు. ఢంకా బజాయించి అధికారంలోకి రాగలమని అనలేకపోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో పార్టీలో తిరుగుబాటు పుట్టకుండా ఆపడం కూడా కష్టం. టికెట్లు ప్రకటించిన తర్వాత అసంతృప్తితో ఉన్నవారిని చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నారు గానీ.. ఆయనతో భేటీ తర్వాత.. తాము బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటాం అని.. కలిసి పనిచేస్తాం అని ఒక్కరూ కూడా చెప్పకుండానే ఇళ్లకు వెళుతున్నారు. ఈ తిరుగుబాటు పోకడలు పార్టీని ముంచుతాయని ప్రజలు అంచనా వేస్తున్నారు.