ఆరోప‌ణ‌ల‌తో వైసీపీని బ‌ద్నాం చేయొచ్చా?

ప్ర‌తి రోజూ టీడీపీ అనుకూల మీడియా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కూడిన క‌థ‌నాల్ని ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేసే ప‌నిలో త‌ల‌మున‌క‌లైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మ‌న‌సెరిగి ఆ మీడియా న‌డుచుకుంటుంద‌ని జ‌గ‌మెరిగిన స‌త్యం.…

ప్ర‌తి రోజూ టీడీపీ అనుకూల మీడియా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కూడిన క‌థ‌నాల్ని ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేసే ప‌నిలో త‌ల‌మున‌క‌లైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మ‌న‌సెరిగి ఆ మీడియా న‌డుచుకుంటుంద‌ని జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే కేవ‌లం ఆరోప‌ణ‌ల‌తో వైసీపీని బ‌ద్నాం చేయొచ్చా? అనేది ప్ర‌శ్న‌. ఇప్పుడేమీ ఎన్నిక‌లు కూడా లేవు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీడియా రాజ‌కీయంగా విడిపోయి వుంది.

ఏఏ ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ఏ రాజ‌కీయ పార్టీకి అనుబంధంగా ప‌ని చేస్తున్నాయో చిన్న పిల్ల‌ల్ని అడిగినా చెబుతారు. అందుకే మీడియా విశ్వ‌స‌నీయ‌త కోల్పోయింది. మీడియా క‌థ‌నాల్ని కూడా జ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు లేవు. త‌మ‌కేంటి? అని ప్ర‌జ‌లు ఆలోచించే ప‌రిస్థితి. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌కు దెబ్బ త‌గిలేలా పాల‌కులు ప్ర‌వ‌ర్తిస్తే ప్ర‌జ‌లు ప‌ట్టించుకుంటారు. ఎన్నిక‌ల్లో త‌మ వ్య‌తిరేక‌త‌ను చూపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అధికారం కోల్పోయిన వైసీపీపై నిత్యం వ్య‌తిరేక వార్త‌ల్ని టీడీపీ అనుకూల మీడియా వండివారుస్తోంది. జ‌నం శాశ్వ‌తంగా వైసీపీని ద్వేషించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ మీడియా క‌థ‌నాలు రాయ‌డం, ప్ర‌సారం చేయ‌డం వెనుక ప్ర‌ధాన ఎజెండా అని అర్థ‌మ‌వుతోంది.

అయితే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకుని, అధికారం నుంచి దిగిపోయిన వైసీపీపై ఇంకా ఏ కార‌ణంతో ద్వేషాన్ని పెంచుకుంటారో ఆలోచించాల్సి వుంటుంది. ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో కూట‌మిని గ‌ద్దె ఎక్కించారు. త‌మ ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టు ప‌రిపాల‌న సాగుతుందా? లేదా? అని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. కోరుకున్న‌ట్టు పాల‌న సాగుతుంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు వుంటుంది.

హామీల్ని అమ‌లు చేయ‌కుండా, కేవ‌లం మీడియాను అడ్డు పెట్టుకుని వైసీపీని బ‌ద్నాం చేయాల‌నే వ్యూహం టీడీపీలో క‌నిపిస్తోంది. కూట‌మిలో టీడీపీ ప్ర‌ధాన పార్టీ. ఆ పార్టీ అధినేతే ముఖ్య‌మంత్రి. అందుకే ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త నిలుపుకోవ‌డం, ఇదే సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్షంపై వ్య‌తిరేక‌త‌ను కొన‌సాగించ‌డ‌మే ఎజెండాగా చంద్ర‌బాబు పెట్టుకున్నారు. ఏ అంశాలు ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపుతాయో సుదీర్ఘ రాజ‌కీయ, ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు తెలియంది కాదు. ఏమ‌వుతుందో చూడాలి.

14 Replies to “ఆరోప‌ణ‌ల‌తో వైసీపీని బ‌ద్నాం చేయొచ్చా?”

  1. హామీలు అమలు వాళ్ళు చేస్తున్నారు స్వామి .. 4k పెన్షన్ ఒక్క సరే పెంచారు .. వాళ్ళు కేవలము పథకాలే కాదు హామీలు ఇచ్చింది …అమరావతి కాపిటల్ డెవలప్ చేస్తాము అన్నారు ..దాని మీద అడుగులు పడుతున్నాయి … పోలవరం మీద ముందు కు వెళ్తున్నారు … ఇండస్ట్రీస్ రాపించడానికి .. మల్లి మీటింగ్స్ అవి పెడుతున్నారు … పక్క రాష్ట్రము తో విభజన సమస్యల మీద మాట్లాడుతున్నారు .. ఇవి కూడా ప్రజలు గామినిస్తున్నారు ..

Comments are closed.