ఫోటో చూసుకుని మురిసిపోతున్న చంద్రబాబు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతటి అల్పసంతోషి అనే విషయం ఈ ఒక్క సంగతి గమనిస్తే అర్థమైపోతుంది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఇప్పుడు అవార్డు రావడంతో.. ఇప్పుడు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతటి అల్పసంతోషి అనే విషయం ఈ ఒక్క సంగతి గమనిస్తే అర్థమైపోతుంది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఇప్పుడు అవార్డు రావడంతో.. ఇప్పుడు అందరిలోనూ అది హాట్ టాపిక్ అవుతోంది. అర్జున్ ను అభినందించే పనిలో అందరూ బిజీగా ఉన్నారు. 

చంద్రబాబునాయుడు కూడా అర్జున్ ను అభినందించేసి.. పనిలో పనిగా తన సొంత డబ్బా వాయించుకోవడానికి కూడా పుష్ప సినిమాను వాడుకోవడం విశేషం.

‘పుష్ప సినిమాలో నేను ఉన్నానని, నా ఫోటోని కొన్ని సన్నివేశాల్లో చూపించారని వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ లో నా ఫోటో ఉంటుంది. మూవీలో నేను టోని కొన్ని సన్నివేశంలో చూపించారని వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్స్ బ్యాక్‌ గ్రౌండ్‌ లో నా ఫోటో ఉంటుంది. మూవీలో చూపించిన టైంలో నేను సీఎంగా ఉన్నానని ఆ ఫోటో పెట్టారా..? లేదా ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్ చేశానని నా ఫోటో పెట్టారో తెలియదు. కానీ దానికే వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు.’ అని చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు.

కానీ దీనికి వైసీపీ వారినుంచి కౌంటర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో రెండు సీన్లలో చంద్రబాబునాయుడు ఫోటో ఉంటుంది. పోలీసు స్టేషన్ లోను, అలాగే సరిహద్దు చెక్ పోస్ట్ లోనూ ఆయన ఫోటో ఉంటుంది. ఈ రెండూ కూడా ప్రభుత్వ కార్యాలయాలే. ఆఫీసుల్లో సీఎం ఫోటో ఉండడం వింత కాదు. అయితే దాని అర్థం ఏమిటనేదే.. చంద్రబాబునాయుడుకు బోధపడడం లేదు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలోనే విచ్చలవిడిగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందనేది ఈ సినిమా ద్వారా మేకర్స్ చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నారు. అయితే, ‘‘నేను ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకున్నాను కాబట్టి నా ఫోటో పెట్టారేమో’’ అంటూ చంద్రబాబునాయుడు సొంత డబ్బా వాయించుకోవడం చాలా లేకిగా ఉంది.

ఎలాంటి విషయానికైనా వక్రభాష్యాలు చెప్పడం అనేది చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు.. తన ఫోటో విషయంలో కూడా ఇలాంటి వక్రభాష్యాలతో ప్రజలను బురిడీ కొట్టించాలని ఆయన అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.