బాబు… అనిత‌ను ప‌ట్టించుకోరా!

తెలుగుదేశం పార్టీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత త‌మ‌కు బ‌కాయి ప‌డ్డ 82,71,584 రూపాయ‌ల‌ను చెల్లించాలంటూ క‌ర్ణాట‌క బ్యాంక్ అనిత‌కు నోటీసులు జారీ చేసింది. అస్తులు త‌నాఖా పెట్టి బ్యాంక్…

తెలుగుదేశం పార్టీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత త‌మ‌కు బ‌కాయి ప‌డ్డ 82,71,584 రూపాయ‌ల‌ను చెల్లించాలంటూ క‌ర్ణాట‌క బ్యాంక్ అనిత‌కు నోటీసులు జారీ చేసింది. అస్తులు త‌నాఖా పెట్టి బ్యాంక్ లో డ‌బ్బులు తీసుకొని క‌ట్ట‌క‌పోవ‌డంతో బ్యాంక్ నోటీసులు ఇచ్చింది.

ఆర‌వై రోజులోగా వ‌డ్డీతో క‌లుపుకొని మొత్తం డ‌బ్బులు బ్యాంక్ లో క‌ట్ట‌ల‌ని, అప్ప‌టి వ‌ర‌కు బ్యాంక్ త‌నాఖాలో ఉన్న అస్తులు ఫ్రీజ్ చేస్తున్న‌ట్లు బ్యాంక్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మ‌హిళ విభాగం అధ్య‌క్షురాలు అయిన అనిత‌ బ్యాంక్ కు అప్పులు చెల్లించకపోవడం అశ్చ‌ర్య‌మే అనిపిస్తుంది.

రాష్ట్రంలో ఎటువంటి స‌మ‌స్య ఉన్న, లేకున్నా రోజుకు నాల‌గైదు ప్రెస్ మీట్ల‌ను నిర్వ‌హించి వైసీపీ నేత‌ల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి నారా చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర మంచి మార్కులు తెచ్చుకున్నా అనిత‌కు చంద్ర‌బాబు ఈ విష‌యంలో స‌హాయం చేయ‌క‌పొవ‌డం విడ్డురంగా ఉంది. 

ఇప్ప‌టికై అనిత, త‌న‌ భ‌ర్త మ‌ధ్య‌లో న‌డుస్తున్నా కేసు, విశాఖ కోర్టులో చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొంటున్నా అనిత‌కు బ్యాంక్ నోటీసులు కూడా తోడ‌య్యాయి. త‌న పార్టీ కోసం త‌ప‌న ప‌డి, ప్ర‌త్య‌ర్ధుల‌ను చెడామ‌డా తిట్టే అనిత లాంటి వారిని ఆదుకోవడానికి చంద్ర‌బాబు, లోకేష్ ఇప్ప‌టికైనా ముందుకు వ‌స్తే అనిత కష్టాల నుండి బ‌య‌ట‌ప‌డుతుంది.