బాబు గారు.. రాగానే మొదలెట్టేశారు !

పాపం తెలుగుదేశం నాయకుల వద్ద గత పది రోజులుగా కొత్త స్క్రిప్టులు లేవు. ఎందుకంటే వాళ్ల నాయకుడు దేశంలో లేడు. వారికి స్క్రిప్టులు నిర్దేశించే వ్యక్తి లేకుండా పోయారు. అందుకే అందరూ కూడా.. మాచర్ల…

పాపం తెలుగుదేశం నాయకుల వద్ద గత పది రోజులుగా కొత్త స్క్రిప్టులు లేవు. ఎందుకంటే వాళ్ల నాయకుడు దేశంలో లేడు. వారికి స్క్రిప్టులు నిర్దేశించే వ్యక్తి లేకుండా పోయారు. అందుకే అందరూ కూడా.. మాచర్ల ఎపిసోడ్ నే పట్టుకుని.. దాన్నే అటు ఇటుగా తిప్పుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ మీద బురద చల్డడానికి తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిం చేస్తూ వచ్చారు.

చంద్రబాబు నాయుడు లేకపోవడం కారణాన, పోలింగ్ ముగిసిన తర్వాత ఇన్ని రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా నడిచాయా అనే అనుమానం కలుగుతోంది ఇప్పుడు! విదేశాలలో విహారయాత్ర ముగించుకుని ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన ముద్రగల మసాలా రాజకీయం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు అలాంటి మాయ రాజకీయానికి పాపం చోటు లేకుండా పోయింది.

చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చి హైదరాబాదులో అడుగు పెట్టారో లేదో అప్పుడే పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జూన్ 1వ తేదీన కౌంటింగ్ ఏజెంట్లు అందరికీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు పురమాయించారు. కౌంటింగ్ నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నది అంటూ ముందు నుంచే బురద చల్లుడు కూడా ప్రారంభించారు. ఈ పది రోజులపాటు ఏపీ రాజకీయాలలో చంద్రబాబు మార్కు రాజకీయ సాముగరిడీలు లేకుండా పోయాయి.

చంద్రబాబు నాయుడు గెలుస్తానని మేకపోతు గాంభీర్యంతో ప్రకటిస్తున్నప్పటికీ.. ఆయనలోని ఓటమి భయం రకరకాల రూపాల్లో వ్యక్తం అవుతోంది. ఓడిపోయినా సరే.. కౌంటింగ్ నాడు వైసీపీ అక్రమాలు చేసిందని రంగు పులమడానికి ఆయన ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది.

ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అటెస్టింగ్ అధికారి స్టాంపులేకుండా ఓట్లు పడ్డాయనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇవి చెల్లవు. కానీ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి .. సంతకం ఉంటే చాలు స్టాంపులేకపోయినా లెక్కపెట్టచ్చునని ఆదేశించారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లు తమకే పడ్డాయనే అభిప్రాయంతో.. చంద్రబాబు ఆ లెక్కింపు చాలా కీలకం అని అందరికీ సూచిస్తున్నారు.

కౌంటింగ్ నాడు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్రమాలు చేస్తారంటూ చంద్రబాబునాయుడు.. విదేశాల నుంచి వచ్చిన తర్వాత తొలి టెలి కాన్ఫరెన్స్ లోనే కార్యకర్తలకు నూరిపోస్తుండడం ఇక్కడ గమనించాల్సిన సంగతి. ఎందుకంటే, చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు చేస్తున్న ఉపదేశం.. కౌంటింగ్ వారికి శిక్షణ ఇస్తున్నట్టుగా లేదు.. వైసీపీ మీద కౌంటింగ్ నాడు ఎగబడానికి రెచ్చగొడుతున్నట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు తిరిగి దేశంలో అడుగుపెట్టగానే.. శాంతిభద్రతల విచ్ఛిన్నానికి కుట్ర మొదలైందని అంటున్నారు.