ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం చేసినా, ఒక పద్ధతి వుంటుంది. టీటీడీ జేఈవోగా తన సామాజిక వర్గానికి చెందిన వెంకయ్య చౌదరిని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈవోగా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్యామలారావును నియమించిన సంగతి తెలిసిందే. దీంతో తిరుమల కొండపై సామాజిక సమీకరణ లెక్క కుదిరింది.
గతంలో జగన్ సర్కార్ ఇలా చేయలేదు. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో అన్నీ ఒకే సామాజిక వర్గానికే. అది రెడ్లకే ఇవ్వడం మిగిలిన సామాజిక వర్గాల్లో స్థానికంగా అసంతృప్తి కలిగించింది. జగన్, చంద్రబాబుకు తేడా ఇదే. చంద్రబాబు మాంసం తింటున్నామని మెడకలో ఎముకలు వేసుకోరు. జగన్ మెడలో వేసుకుంటారు. అందుకే రాజకీయంగా దుస్థితిలో పడ్డారు.
వెంకయ్య చౌదరిని తీసుకురావడం ద్వారా టీటీడీపై చంద్రబాబు కుటుంబం పూర్తిస్థాయిలో పట్టు తెచ్చుకోనుంది. కొండపై స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తోక తిప్పే అవకాశం వుండదు. వెంకయ్య చౌదరిని తీసుకొచ్చిన ఉద్దేశమే అందుకు అంటున్నారు. కొండంతా తమదే అన్నట్టు తిరుపతి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి.
కొండపై తట్టలు, ఇతర వ్యాపార వ్యవహారాల్లో స్థానిక కూటమి నాయకులు దారుణాలకు తెగబడుతున్నారు. వీటికి త్వరలో చెక్ పెట్టేందుకు వెంకయ్య చౌదరి వెళ్లనున్నారు. అంతా చంద్రబాబు కుటుంబ కనుసన్నల్లోనే ఆయన విధులు నిర్వర్తించనున్నారు.