చిన బాబు ఎలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చెబుతాడో

సాధారణంగా రాజకీయాలే ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తెల్లవారి లేస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. రాజకీయాలు అనేవి నాయకులకు ఉత్కంఠగానే ఉంటాయి.  Advertisement ప్రజలకూ అలాగే ఉంటాయి. అందుకే ప్రజలు…

సాధారణంగా రాజకీయాలే ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తెల్లవారి లేస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. రాజకీయాలు అనేవి నాయకులకు ఉత్కంఠగానే ఉంటాయి. 

ప్రజలకూ అలాగే ఉంటాయి. అందుకే ప్రజలు ఎప్పుడూ వారి కుటుంబ సమస్యలు, వారి ఊరి సమస్యలు మాట్లాడటం కంటే రాజకీయాలు మాట్లాడటం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. రాజకీయాలే చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయనుకుంటే నాయకులు చేసే ప్రకటనలు, పరస్పరం విసురుకునే సవాళ్లు మరింత ఆసక్తికరంగా ఉంటాయి.

నా అవినీతిని నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా అని ఒక నాయకుడు అంటే, నా అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అనో, నా పదవికి రాజీనామా చేస్తాననో ఒక నాయకుడు సవాల్ చేస్తాడు. దీంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. కానీ చిరాఖరుకు వచ్చేసరికి ఎవరి అవినీతిని ఎవరూ రుజువు చేయరు. 

ఎందుకంటే ఇద్దరూ అవినీతిపరులే కాబట్టి. రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని సవాల్ విసిరేవారు, పదవిని వదులుకుంటానని చెప్పేవారు ఎవరూ ఆ పని ఎప్పటికీ చేయరు. జనంలో మాత్రం ఏదో జరుగుతుందనే సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. 

తాజాగా మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా చంద్రబాబు తనయుడు లోకేష్ జనాల్లో ఓ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఆయన ఏం బాంబు పేలుస్తాడోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన చెప్పబోయే ఆ థ్రిల్లింగ్ విషయం ఆషామాషీ నాయకుడి గురించి కాదు. 

ముఖ్యమంత్రి జగన్ గురించే. ఇంతకూ లోకేష్ ఏమన్నాడు? ఏమన్నా అంటే కదా చెప్పుకోవడానికి. ఆయన ఏమీ అనకపోవడమే పెద్ద సస్పెన్స్. ఇంతకూ లోకేష్ అసలు ఏమీ అనలేదా ? అన్నాడు.

సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతానని చెప్పాడు. ఇప్పుడు అదే నరాలు తెగే ఉత్కంఠగా ఉంది. ఆ కుంభకోణమేదో వెంటనే చెప్పావచ్చుగా. దానికోసం వచ్చే వారం వరకు ఆగాలా? చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టదు కదా. ఓహో …కుంభకోణం గురించి చెబుతానని అన్నాడు కాబట్టి దాన్ని వండి వార్చాలేమో. వారం దాటితే లోకేష్ ఏం చెప్పాడో ఎవరికీ గుర్తుంటుంది?