ఏ పార్టీలో ఉన్న ఉన్నత పదవులు వరించడంలో దిట్టా అయిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ భేటీలో ఇరువురూ పలు రాజకీయ ఆంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం.
ఒకవైపు చిరంజీవితో భేటి కేవలం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ సందర్భంగా అభినందనలు తెలియజేయడానికే అని గంటా వర్గీయులు చెబుతున్నా గంటా- చిరంజీవి బంధం తెలిసినా వారు ఎవరూ కూడా నమ్మడం లేదు. గంటా చంద్రబాబు తరుపున రాయభారంతో వెళ్లరని టీడీపీ శ్రేణుల నుండి వస్తున్నా వార్తలు.
తన సామాజిక మీడియాలో చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ పై నెగెటివ్ వార్తలు రావడంతో చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ కాస్తా బాధపడ్డారని వారిని చల్లార్చడానికే ఈ భేటి జరిగిందని వినికిడి. చంద్రబాబు అదేశాలతోనే చిరుతో గంటా కలిశారని తెలుస్తోంది.
టీడీపీతో రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టిన గంటా ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసి, తర్వాత తన సామాజిక వర్గానికి చెందిన పార్టీగా భావించి ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా అయిన గంటా… చిరంజీవి తన పార్టీనీ కాంగ్రెస్ పార్టీలోకి విలినం చేయడంతో గంటాకు ప్రజారాజ్యం తరుపున మంత్రి పదవి వరించింది. తర్వాత కాంగ్రెస్ ను విడీ 2014 ఎన్నికల ముందు మళ్లీ తన సొంత గూడు అయిన టీడీపీలోకి వచ్చి మంత్రిగా చేసిన గంటా వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయంగా సైలెంట్ గా ఉంటూన్నారు.