విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి త్వరలో డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కానున్నారు. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి.
తొలి రోజునే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మీద ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. వైశ్య సమాజిక వర్గానికి మంత్రి వర్గంలో స్థానం దక్కనందుకు డిప్యూటీ స్పీకర్ పదవిని జగన్ కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా ఆ పదవిలో ఉన్న కోన రఘుపతి స్థానంలో కోలగట్ల వీరభద్రస్వామి ఆ కుర్చీలోకి రానున్నారు అన్న మాట. అలా ఆయన ఎన్నిక లాంచనం అవుతుంది. రానున్న రెండేళ్ళ కాలానికి ఆయనే ఉప సభాపతిగా ఉంటారన్న మాట.
అదే కనుక జరిగితే శాసన సభ స్పీకర్ ఉప సభాపతి ఇద్దరూ ఉత్తరాంధ్రాకే చెందిన వారు అవుతారు. అంతే కాదు, ఇద్దరూ పక్క పక్క జిల్లాలకు చెందిన వారు గా ఉంటారు. స్పీకర్ తమ్మినేని సీతరామ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు అన్న సంగతి తెలిసిందే.
మొత్తానికి రాజకీయంగానే కాదు, రాజ్యాంగపదవుల పరంగా కూడా ఉత్తరాంధ్రాకు వైసీపీ సర్కార్ పెద్ద పీట వేసిందని అంటున్నారు.