బాగా డబ్బులిస్తే మీడియా వాళ్లు మంచి కవరేజ్ ఇస్తారని విన్నానని, అయితే ఫైనాన్సియల్‌గా తన దగ్గర డబ్బులు లేవని అందుకే ఇవ్వలేక పోయానని దివ్యవాణి వాపోయింది. దీనికి విలేకరులు ఏదో చెప్పబోతే తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్తానని అన్నారు.
రాజీనామా ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ ఏమీ ఇవ్వకపోయినా తనకి మంచి కవరేజ్ ఇచ్చారని థ్యాంక్స్ చెబుతూ ఈ సారి విజయవాడ వచ్చినపుడు ఆత్మీయ విందు ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తనని గతంలో టీవీలో విమర్శించిన ఒక విలేకరిని ఈడియట్ అని పలుమార్లు తిట్టారు.
దివ్యవాణికి తెలియని ఇంకో విషయం ఏమంటే మీడియాని మేనేజ్ చేయడం తెలుగు రాజకీయ నాయకులకి నేర్పిందే చంద్రబాబు. అవసరాల కోసం మీడియాని వాడడంలో ఆయన ఆది గురువు.
1995కు ముందు ప్రెస్‌మీట్స్‌లో టీ, బిస్కెట్ ఇచ్చేవాళ్లు. ఎపుడైనా లంచ్ అరేంజ్ చేసేవాళ్లు. బిజినెస్ ప్రెస్‌మీట్‌లలో అయితే చిన్నచిన్న గిప్ట్స్ ఇచ్చేవాళ్లు. 95లో NTR మీద చంద్రబాబు చేసిన కుట్రలో మీడియాకి కూడా భాగస్వామ్యం వుంది.
బాబు వెనుక MLA లు లేకపోయినా 175 మంది ఉన్నట్టు ప్రచారం చేసి వైశ్రాయ్ హోటల్‌కి MLA లని తరలించిన వాళ్లలో రిపోర్టర్ల పాత్ర వుంది. అప్పటి నుంచి మీడియా మేనేజ్‌మెంట్ ప్రారంభమైంది. గిప్ట్‌ల స్థానంలో ప్యాకేజీలు , సూట్‌కేసులు వచ్చాయి. బాబు అండతో కోట్లు సంపాదించిన జర్నలిస్టులు ఎవరో అందరికీ తెలుసు.
మీడియా మేనేజ్‌మెంట్ మీద అవగాహన లేకుండా దివ్యవాణి అధికార ప్రతినిధిగా కొనసాగడం అనవసరం. ప్రజలకి సేవ చేయాలని చంద్రబాబు దగ్గర చేరడం దివ్యవాణి అమాయకత్వం.
బాబుది కరివేపాకు సిద్ధాంతం. పార్టీ నుంచి విసిరేసిన కొత్త కరివేపాకు దివ్యవాణి. రోజాను పచ్చిపచ్చిగా తిట్టడం వెనుక దాగి వున్న ఆవేదన దివ్యవాణి ప్రెస్‌మీట్ చూస్తే తెలుస్తుంది.