వ్యక్తిగత గొడవలతో ఇద్దరు యువ మహిళా జర్నలిస్టులు వీధినపడ్డారు. వీరి గొడవకు సంబంధించిన వీడిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గొడవకు సంబంధించి పరస్పరం వీడియోలు తీసుకుని మరీ సోషల్ మీడియాలో షేర్ చేసి, అందరికీ తెలియజేసి, జర్నలిస్టుల పరువు తీశారు. ఇద్దరూ మహిళా జర్నలిస్టులు ప్రముఖ చానళ్లకు ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం.
విజయవాడలో సీఎంవో బీట్ చూసే టీవీ9, ఎన్టీవీ ప్రతినిధిలు హసీనా, రెహానా గొడవ పడ్డారు. కాదేదీ కెమెరా విజువల్కు అతీతమన్నట్టుగా …చివరికి తాము గొడవపడ్డ దృశ్యాలను కూడా కెమెరాకెక్కించారు. సహజంగా వృత్తిలో భాగంగా వివిధ రంగాలకు చెందిన వారి గొడవలు, ఇతరత్రా అంశాలను వార్తలుగా మలుస్తుండడం చూశాం. అయితే ఈ ఇద్దరు యువ మహిళా జర్నలిస్టులే గొడవలతో బజారుకెక్కి, వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు.
వృత్తిలో భాగంగా జెలసీనే ఇద్దరి మధ్య గొడవకు కారణంగా తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎన్టీవీ ప్రతినిధి రెహానా కాస్త తెలివిగా ప్రవర్తించినట్టు అర్థమవుతోంది. తాను మాత్రం చాలా హూందాగా నడుచుకున్నట్టు, హసీనా తనపై రంకెలేస్తున్న వీడియోలను చక్కగా తీసి, అందరికీ షేర్ చేయడం గమనార్హం.
“నీ కథలు ఎవరికీ తెలియదు. నీ చరిత్రంతా నా దగ్గరుంది. నీ ఈమెయిల్స్ అన్నీ నా దగ్గరున్నాయి. ఇట్లాంటి జర్నలిజం చేయకు. కొట్టడం, గిచ్చడం చేయకు” అంటూ రెహానాకు హసీనా వార్నింగ్ ఇవ్వడాన్ని చూడొచ్చు. ఇద్దరు జర్నలిస్టుల గొడవపై సంబంధిత యాజమాన్యాలు సీరియస్గా స్పందించినట్టు తెలిసింది. హసీనాను హైదరాబాద్కు, రెహానాను విశాఖకు బదిలీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.