బీజేపీ గీత ఆమె మారుస్తుందా…?

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ఎంపీ సీటుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇంచార్జిగా ఉన్నారు. ఆమె 2014లో వైసీపీ తరఫున మొదటిసారి ఎంపీగా అరకు నుంచి నెగ్గారు. ఆ తర్వాత ఆమె వైసీపీని…

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ఎంపీ సీటుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇంచార్జిగా ఉన్నారు. ఆమె 2014లో వైసీపీ తరఫున మొదటిసారి ఎంపీగా అరకు నుంచి నెగ్గారు. ఆ తర్వాత ఆమె వైసీపీని వీడారు. టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు జాగృతి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. బీజేపీకి విశాఖ ఎంపీ సీటు 2014లో టీడీపీ పొత్తులో దక్కింది. 2019లో విడిగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి డిపాజిట్లు విశాఖ రాలేదు. అరకు ఊసు చెప్పనక్కరలేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

పొత్తులు ఉంటే విశాఖ సీటు తీసుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీకి సిద్ధమవుతున్నారు. 2014లో మాదిరిగా మరోసారి గెలవాలని ఆమె చూస్తున్నారు. అయితే అది వైసీపీ పార్టీ కాబట్టి సాధ్యమైంది. బీజేపీ తరఫున పోటీ చేస్తే గెలుస్తారా అన్నది సొంత పార్టీ వారికే డౌట్.

పొత్తులలో భాగంగా అరకు సీటుని కూడా తీసుకుంటే గీతకు గట్టి పోటీ ఇచ్చే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. విశాఖ ఏజెన్సీ వైసీపీకి గట్టి మద్దతుగా ఉంది. అరకు బీజేపీ గీతను మార్చేందుకు తన రాజకీయ గీతను మార్చుకునేందుకు కొత్తపల్లి గీత అరకులో పర్యటిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి బాలేదని, అరకు ప్రధాన రోడ్లు వాన పడితే పొలాలను తలపిస్తున్నాయని గీత ఆందోళన చేపట్టారు. బీజేపీకి ఏపీకి ఎన్నో నిధులు ఇస్తూన్నా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో వెనకబడిపోయిందని కొత్తపల్లి గీత సరికొత్త ఆరోపణలు చేశారు. గీత రాజకీయ ఆరాటానికి బీజేపీ నుంచి ఎంతవరకూ మద్దతు ఉంటుంది, ఆమెకు పొత్తులో అయితే అరకు సీటు దక్కుతుందా లేదా అనేది రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే అంటున్నారు.