వైసీపీ ఎమ్మెల్యే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే….!?

ఆయనను వైఎస్సార్ కుటుంబం బాగా చేరదీసింది. వైఎస్సార్ 2009 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట నుంచి గెలిపించారు. వైఎస్సార్ మరణంతో జగన్ వైపు చేరిన ఆయనే…

ఆయనను వైఎస్సార్ కుటుంబం బాగా చేరదీసింది. వైఎస్సార్ 2009 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట నుంచి గెలిపించారు. వైఎస్సార్ మరణంతో జగన్ వైపు చేరిన ఆయనే పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. ఆయన వైసీపీ తరఫున 2012లో పాయకరావుపేట ఉప ఎన్నికల్లో గెలిచారు.

ఇక 2014లో మాత్రం అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో తిరిగి ఆయనకు పాయకరావుపేట టికెట్ ఇవ్వడంతో మూడవసారి ఎమ్మెల్యే అయిపోయారు. ఈసారి ఆయనకు టికెట్ రాదు అన్న మాట ఉంది. కానీ ఆయనకు అనుకోని అదృష్టం వరించింది. ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా జగన్ చేస్తున్నారు.

దీంతో బాబూరావు లక్కీ అని వైసీపీలో అంతా మెచ్చుకునే పరిస్థితి ఉంది. అయితే బాబూరావు మీద ఇపుడు అతి పెద్ద బాధ్యత పడింది అని అంటున్నారు. ఆయన పాయకరావు పేట నుంచి కంబాల జోగులుని గెలిపించాల్సి ఉంది అని అంటున్నారు.

బాబూరావుకు పాయకరావుపేటలో పట్టుంది. పార్టీలో ఒక వర్గం ఆయనను వద్దు అని చెప్పడంతో పాటు జనంలో వ్యతిరేకత ఉండడంతో టికెట్ నిరాకరించారు ఆయన వర్గం ఈసారి కూడా పాయకరావుపేటలో వైసీపీ జెండా ఎగిరేలా చూడాలని అంటున్నారు.

బాబురావు అభ్యర్ధి కాకపోతే పనిచేస్తామని వైసీపీలో రెండవ వర్గం అంటోంది. కాబట్టి అన్ని వర్గాలను కలుపుకుని వైసీపీకి ఘన విజయం సాధించడమే బాబూరావు వైసీపీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని అంటున్నారు. అలా ఆయన చేసినపుడే ఆయనకు ఇచ్చిన రాజ్యసభ మెంబర్ షిప్ కి కూడ అర్ధం పరమార్ధం అంటున్నారు.