విశాఖ నుంచి ఎంపీ బరిలో ఆ ఇద్దరూ…?

విశాఖ ఎంపీ సీటు అంటే దాని వాల్యూ చాలా ఉంటుంది. పార్లమెంట్ లో అందరికీ తెలిసిన పార్లమెంట్ సీట్లలో విశాఖకు ఉన్న క్రేజ్ వేరేగా ఉంటుంది. ఏపీలో ఉన్న పాతిక సీట్లలో బరువైన సీటుగా…

విశాఖ ఎంపీ సీటు అంటే దాని వాల్యూ చాలా ఉంటుంది. పార్లమెంట్ లో అందరికీ తెలిసిన పార్లమెంట్ సీట్లలో విశాఖకు ఉన్న క్రేజ్ వేరేగా ఉంటుంది. ఏపీలో ఉన్న పాతిక సీట్లలో బరువైన సీటుగా విశాఖ చెప్పాలి. విశాఖ నుంచి ఎంపీ అంటే ఆ దర్జా దర్పం కూడా ఒక స్థాయిలో ఉంటాయని అంటారు.

విశాఖ నుంచి ఈసారి ఎంపీగా ఏ పార్టీల నుంచి ఎవరెవరు అన్నది చూస్తే ముందుగా బీజేపీ నుంచే చెప్పుకోవాలి. బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావు పోటీ చేయబోతున్నారు. ఆయన తన నివాసాన్ని ఇప్పటికే విశాఖకు మార్చుకున్నారు.

తాజాగా విశాఖలో యూపీ స్టేట్ ఆవిర్భావ సభను జరిపి ఉత్తరాది ఓట్లకు గేలం వేశారు. విశాఖలో ఇతర రాష్ట్రాల ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు, వారిని బీజేపీ వైపుగా తిప్పుకుంటే తనకు మేలు చేస్తుందని ఆయన ఆలోచిస్తున్నారు. జీవీఎల్ పోటీకి బీజేపీ హై కమాండ్ కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.

ఆయన తరువాత విశాఖ ఎంపీ సీటు మీద మోజు పెంచుకున్న వారుగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన విశాఖ నుంచి 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీకి దిగారు, ఓడారు. 2024లో మరోసారి పోటీకి ఆయన చూస్తున్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయడం ఖాయమే కానీ రాజకీయ పార్టీ ఏది అన్నది ఇంకా సస్పెన్స్ అని జేడీ అంటున్నారు.

తన భావజాలానికి అనువు అయిన పార్టీ నుంచే పోటీకి దిగుతాను అని అంటున్నారు. అలా కుదరకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని చెబుతున్నారు. ఇలా కనుక చూసుకుంటే ఇద్దరు ఎంపీ అభ్యర్ధులు ఎన్నికలకు చాలా సమయం ముందే బయటపడ్డారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారు అన్నది ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు. 

తెలుగుదేశం తరఫున పోటీకి తాను సిద్ధమని బాలయ్య అల్లుడు భరత్ అంటున్నా అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇస్తుంది అన్నది తెలియదు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మరోసారి పోటీకి నో చాన్స్ అంటున్నారు.