ఆత్మ‌కూరులో గెలిపించే బాధ్య‌త వీరిదే!

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు ఇవాళ్టితో నామినేష‌న్ల గ‌డువు ముగిసింది. మొత్తం 27 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. బ‌రిలో జాతీయ పార్టీ బీజేపీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ, బీఎస్పీతో పాటు మ‌రికొన్ని…

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు ఇవాళ్టితో నామినేష‌న్ల గ‌డువు ముగిసింది. మొత్తం 27 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. బ‌రిలో జాతీయ పార్టీ బీజేపీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ, బీఎస్పీతో పాటు మ‌రికొన్ని పార్టీల నేత‌లు నిలిచారు. ఆత్మ‌కూరు వైసీపీకి కంచుకోట‌. సంప్ర‌దాయం సాకుతో టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పార్టీలు పోటీ నుంచి త‌ప్పుకున్నాయి.

నామినేషన్లు ముగియ‌డంతో వైసీపీ మ‌రింత యాక్టీవ్ అయ్యింది. పూర్తిస్థాయిలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఏర్పాట్లు చేసింది. ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆరు మండ‌లాల‌కు బాధ్యుల‌ను వైసీపీ నియ‌మించింది.  ఒక్కో మండలానికి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేను బాధ్యులుగా నియమించి క‌ద‌న రంగానికి సిద్ధ‌మ‌య్యారు.  

ఆత్మకూరు అర్బన్‌కు మంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆత్మకూరు రూరల్‌కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి, అనంతసాగరం మండలానికి మంత్రి మేరుగ నాగార్జున‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏఎస్‌పేట మండలానికి మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, చేజర్ల మండలానికి మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రిపాడుకు మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌, సంగం మండలానికి మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిని నియ‌మించారు.

ఈ జాబితాలో గ‌తంలో మంత్రులుగా ప‌ని చేసిన కొడాలి నాని, అనిల్‌కుమార్ యాద‌వ్ ఉన్నారు. ఈ ద‌ఫా ఉప ఎన్నిక‌కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బాధ్య‌త‌లు తీసుకున్న వారిలో పెద్దిరెడ్డి త‌మ్ముడు, తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యే ద్వార‌కానాథ్‌రెడ్డి ఉండ‌డం విశేషం. ఆత్మ‌కూరులో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్య‌త వీరిదే. ల‌క్ష మెజార్టీని సాధిస్తారో లేదో చూడాలి.