ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలుగులో అతి పెద్ద రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఎంత సక్సెస్ అయ్యిందో అంతే విమర్శలను మూటగట్టుకుంటుంది. ఇవాళ బిగ్ బాస్ షోను నిషేధించాలని ఏపీ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్ పై విచారణ జరిగింది.
టీవీ షోలు ఇండియన్ 'బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) గైడ్‌లైన్స్ పాటించడం లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అశ్లీలత, అసభ్యత ఎక్కువయ్యిందంటూ కోర్టుకు వివరించారు. బిగ్ బాస్ లో అశ్లీలతోపై కోర్టు ఘాటుగా స్పందించింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసూ కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు వ్యాఖ్యలపై స్పందించడానికి కేంద్రం తరుపు లాయర్ సమయం కావాలని కోర్డును కోరారు. దీంతో విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది హైకోర్టు.
ఇప్పటికే బిగ్ బాస్ షో అశ్లీలత ఎక్కువైందంటూ… కుటుంబంతో కలిసి చూసేలా లేదంటూ విమర్శలు వస్తునే ఉన్నాయి. బిగ్ బాస్ షో పై సీపీఐ నారాయణ చాలా సార్లు ఫైర్ అయ్యారు. సమాజాన్ని చెడగొట్టేలా ఉందంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ తో పోల్చారు నారాయణ.
ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎన్ని కేసులు పెడుతున్న బిగ్ బాస్ ఇండియా మొత్తం సక్సెస్ లతో సీజన్లుకు సీజన్లు పుట్టుకు వస్తున్నాయి. హిందితో పాటు పలు ప్రాంతీయ భాషలో కూడా బిగ్ బాస్ సీజన్లు వస్తున్నే ఉన్నాయి.