ఆంధ్ర సిఎమ్ జగన్ తన భద్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనకు తెలుసు తను ఎంత మందితో పోరాడుతున్నారో. తనను ఏదో విధంగా అడ్డం తొలగించుకోవాలని తన శతృవులు చూస్తుంటారని. తన తండ్రి రెండు సారి అధికారంలోకి రావడంతో ఏం జరిగిందో తెలుసు. అందుకే తన పర్యటనల్లో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే జగన్ ను ప్రతిపక్షాలు విపరీతంగా రెచ్చ గొడుతున్నాయి.
బ్యారకేడ్లు, డేరాలు కడుతున్నారని, పిల్లి అని ఇలా రకరకాలుగా రెచ్చ గొడుతున్నారు. అయినా జగన్ అస్సలు పట్టించుకోవడం లేదు. వాళ్లు అంటున్నారని, తన భద్రతను గాలికి వదిలేస్తే తనను ఏం చేస్తారో జగన్ కు తెలియంది కాదు.
ఈ రోజు స్పెషల్ ఫ్లయిట్ గాల్లోకి ఎగరగానే లోపం తలెత్తింది. ఓ ముఖ్యమంత్రి ప్రయాణించే ఫ్లయిట్ లో లోపం అంటే ఏమనుకోవాలి? అందుకే జగన్ ఈ విషయంలో చాలా ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. దీని మీద విచారణకు కూడా ఆదేశించారు. రాబోయే ఏడాదిన్నర జగన్ చాలా జాగ్రత్తగా వుండాల్సి వుంది. ఎందరో బిజినెస్ జనాలకు, ఎందరో రాజకీయ ఆశ్రితులకు, భయంకరమైన పలుకుబడి వున్న పెద్దలకు, అన్నింటికి మించి ఓ బలమైన కులానికి జగన్ కొరకరాని కొయ్యిగా తయారయ్యారు.
రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం ఇప్పటికీ మిస్టరీనే. అలాంటి దౌర్భాగ్యం, దుస్థితి రాకుండా జగన్ తనను తాను కాపాడుకోవాల్సి వుంది. ఈ విషయంలో అస్సలు పౌరుషానికి పోవడానికే లేదు.