సీఎం జగన్ కేరాఫ్ జీవీఎంసీ ఫోర్త్ వార్డ్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేరాఫ్ తాడేపల్లి. ఇది నాలుగేళ్ళుగా ఆయన చిరునామా. గుంటూరు జిల్లాలో సీఎం ఉంటున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా అక్కడే పనిచేస్తోంది. అయితే ఇక మీదట జగన్ ఎక్కువ రోజులు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేరాఫ్ తాడేపల్లి. ఇది నాలుగేళ్ళుగా ఆయన చిరునామా. గుంటూరు జిల్లాలో సీఎం ఉంటున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా అక్కడే పనిచేస్తోంది. అయితే ఇక మీదట జగన్ ఎక్కువ రోజులు అక్కడ ఉండే చాన్స్ లేదు.

జగన్ తానుగా చెప్పినట్లుగానే విశాఖకు షిఫ్ట్ అవుతున్నారు. విశాఖలో సచివాలయం ఎక్కడ వస్తుంది. మంత్రుల క్వార్టర్స్ ఎక్కడ అన్న దాని మీద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. భీమిలీ బీచ్ రోడ్డులోని సువిశాలమైన ప్రభుత్వ భవనాలు మొత్తం ఏపీ ప్రభుత్వ శాఖలతో మంత్రులతో ఇక మీదట నిండిపోనుంది అని ఆయన ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటారు అన్నది ఇపుడు అందరికీ ఆసక్తిని గొలిపే అంశంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ భీమిలీ నియోజకవర్గంలోనే ఉంటారు. జీవీఎంసీ పరిధిలోని నాలుగవ వార్డులో ఆయన నివాసానికి సంబంధించి భవనాలను చూస్తున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

ఇదే విషయాన్ని భీమిలీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఉగాది నుంచి భీమిలీలోనే ఉంటారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు నుంచి సీఎం తమ ప్రాంతాలోనే ఉండి పాలన చేస్తారని పేర్కొంటున్నారు. మార్చి 22న ఉగాది పండ‌గ‌. ఆ రోజు మంచి ముహూర్తంగా ఉంది. దాంతో ఆరు నూరు అయినా సీఎం క్యాంప్ ఆఫీస్ తో సహా జగన్ విశాఖకు తరలిరానున్నారు అని అంటున్నారు.