ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైమ్ ఆ జిల్లాలో..?

జగన్ ముఖ్యమంత్రి అయి మూడేళ్ళు పై దాటింది. చాలా కాలం కరోనా ప్రభావం ఏపీలో ఉంది. దాంతో ఆయన ఎక్కడా కాలు బయటపెట్టలేకపోయారు. ఈ మధ్యనే జిల్లా టూర్లు చేస్తూ వస్తున్నారు. అలా ఉత్తరాంధ్రాలోని…

జగన్ ముఖ్యమంత్రి అయి మూడేళ్ళు పై దాటింది. చాలా కాలం కరోనా ప్రభావం ఏపీలో ఉంది. దాంతో ఆయన ఎక్కడా కాలు బయటపెట్టలేకపోయారు. ఈ మధ్యనే జిల్లా టూర్లు చేస్తూ వస్తున్నారు. అలా ఉత్తరాంధ్రాలోని చిట్టచివరి జిల్లా శ్రీకాకుళంలో ముఖ్యమంత్రిగా తొలి అధికార కార్యక్రమాన్ని జగన్ నిర్వహించడం విశేషం.

జగన్ సీఎం అయ్యాక రెండు మూడు సందర్భాలలో ఈ జిల్లాకు వచ్చారు. అవి కేవలం హాల్ట్ లో భాగమే తప్ప అధికార కార్యక్రమాలు అయితే కావు. కానీ ఈ నెల 27న అమ్మ ఒడి మూడవ విడత నగదు బదిలీ పంపిణీకి ఈ జిల్లాను వేదికగా ఎంచుకున్నారు. అదే విధంగా పలు అభివృద్ధి కర్యక్రమాలను ఆయక శంకుస్థాపన చేస్తారు.

ఇక శ్రీకాకుళం నగరంలో ఒక భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. ఆ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగం చేస్తారు. ఈ మధ్యనే చంద్రబాబు బాదుడు బాదుడు పేరిట జిల్లాకు వచ్చి హల్ చల్ చేశారు.  

వైసీపీ సర్కార్ మీద అనేక విమర్శలు చేశారు. ఆ తరువాత జిల్లాల టూర్ల పేరిట ఆయన విశాఖ విజయనగరంలో తిరిగి జగన్ని టార్గెట్ చేశారు. బహుశా వాటన్నిటికీ కలిపి శ్రీకాకుళం వేదికగా జగన్ గట్టి జవాబు చెబుతారు అని అంటున్నారు.

ఇక సీఎం సిక్కోలు టూర్ కి వస్తున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రాకు చెందిన వైసీపీ కీలక నేతలు అంతా చలో శ్రీకాకుళం అంటున్నారు. వీలైతే సీఎం తో భేటీకి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జగన్ అధికారిక కార్యక్రమం కోసం జిల్లాకు వస్తున్నా కూడా రాజకీయ హడావుడి అయితే చాలానే ఉంది.