జగన్ అంటేనే ఒక బ్రాండ్. పొలిటికల్ గా ఆయన లెక్కలు వేరేగా ఉంటాయి. ట్రెడిషనల్ పాలిటిక్స్ కి ఆయన పూర్తి దూరం. తన ప్రత్యర్ధి అంటే ఆయన వారి దరికి వెళ్ళరని కూడా చెబుతారు. ఇక ఏపీలో టీడీపీ వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధి. టీడీపీ ఉనికి లేకుండా చేయడమే వైసీపీ పొలిటికల్ ఫిలాసఫీ కూడా.
ఈ నేపధ్యంలో జగన్ టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్నారు అంటే ఎలా అర్ధం చేసుకోవాలి అంటే దానికి కూడా ఒక లెక్క ఉంది. ఆయన టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే కానీ ఆయన రెండేళ్ళ క్రితమే వైసీపీ నీడకు చేరారు. ఆయనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన వైసీపీకి జై కొడుతున్నారు.
అసెంబ్లీ రికార్డులలో ఆయన ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే. అయితే ఆయన వైసీపీ తరఫునే సౌత్ నియోజకవర్గానికి ఇంచ్జారిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి. ఆయన కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. దానికి హాజరు కావాలని జగన్ని ఆయన అహ్వానించారు. అయితే జగన్ ఆ టైమ్ లో ఢిల్లీ వెళ్ళారు. దీంతో ఇపుడు తీరిక చేసుకుని ఆయన ఇంటికి వెళ్తున్నారు.
ఈ నెల 16న జగన్ విశాఖ టూర్ ఉంది. ఈ టూర్ లో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే షెడ్యూల్ ని కూడా పొందుపరచారు. దాంతో పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి పరిసరాల భద్రతను పరిశీలించి అంతా కట్టుదిట్టం చేశారు.
ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. వాసుపల్లి టీడీపీలోనే పుట్టి పెరిగారు. కానీ ఎపుడూ ఆయన ఇంటికి చంద్రబాబు రాలేదు. కానీ సీఎం హోదాలో జగన్ వెళ్తున్నారు అంటేనే పొలిటికల్ మాధమెటిక్స్ ఏంటి అన్నది అర్ధం చేసుకోవాలని అంటున్నారు.