ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని అదే రీతిలో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు ఏదో తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా.. రాజకీయాలు ఎందుకు? డ్యాన్సులు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని తన వాళ్లకి చెప్పొచ్చు కదా అని హితవు పలికారు.
కాగా నిన్న వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'యాక్టర్ల రెమ్యూనిషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశల గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయలంటూ' ఏపీ ప్రభుత్వాని ఉద్దేశిస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే.
దీనంతటికీ ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుపై వెటకారం చేసి పవన్ నీతులు చెప్పడమే. దానిపై అంబటి మాట్లాడుతూ.. పవన్ తన సినిమా రెమ్యునరేషన్ చెప్పాలని, బ్రో సినిమా వెనుక చంద్రబాబు ఫ్యాకేజీ ఉందంటూ కామెంట్స్ చేశారు. దాంతో తన తమ్ముడి సినిమాపై అంబటి మాట్లాడినందుకు చిరంజీవి ప్రభుత్వంపై కామెంట్స్ చేసినట్లు అర్థం అవుతోంది.